Skip to main content

Baskar Pedia

ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా శనగ కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు జిలా కలెక్టర్  చెరుకూరి శ్రీధర్ తెలిపారు. పీజిఆర్ఎస్ హాల్ లో ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు పై జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 80,103 హెక్టార్లలో శనగ పంట సాగైనట్లు తెలిపారు.  దళారుల చేతుల్లో  మోసపోకుండా కనీస మద్దతు ధరతో మార్క్ ఫెడ్ కొనుగోలు చేస్తుందని తెలిపారు.

* కొనుగోలు కేంద్రాలు

పులివెందుల, తొండూరు, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దుటూరు, కమలాపురం

* రైతులు పాటించవలసిన నియమాలు

  1. శనగ పంట సాగు చేసిన రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలి
  2. నమోదు చేసిన రైతులకు ఉత్పత్తి పరిమాణం, తీసుకురావాల్సిన తేదీ, కేంద్రం వివరాలు SMS ద్వారా తెలియజేస్తారు
  3. SMS అందుకున్న రైతులు కేటాయించిన తేదీన కొనుగోలు కేంద్రానికి పంట దిగుబడులను తేవాలి
  4. శనగ పంటను నూర్పిడి చేసి బాగా ఆరబెట్టి శుభ్రం చేయాలి
  5. తేమ శాతం 14% లోపు ఉండేలా ఆరబెట్టాలి
  6. ముందుగా ఖాళీ గోనె సంచులు ఇవ్వబడవు
  7. రైతులు తమ సొంత గోనె సంచుల్లోనే పంట దిగుబడులను తేవాలి

నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న శనగలను తూకం వేసి ఏపీ మార్క్ ఫెడ్ గోనె సంచుల్లో నింపబతుందని, రైతులు తమ గోనె సంచులను తిరిగి తీసుకెళ్లాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో లోడింగ్ వరకు అయ్యే ఖర్చులను రైతులే భరించాలన్నారు. శనగ పంట e-Crop నమోదైన రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేస్తారని వివరించారు.  ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా నంబర్ (IFSC కోడ్‌తో), పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్రతులను అందజేయాల్సి ఉంటుందని వెల్లడించారు.

* శనగ కొనుగోలుకు నాణ్యత ప్రమాణాలు

1.తేమ శాతం – 14%

2.ఇతర వ్యర్థ పదార్థాలు- 1%

3.ఇతర పంట గింజలు- 3%

4.దెబ్బతిన్న గింజలు- 3%

5.పాక్షికంగా దెబ్బతిన్న గింజలు-4%

6.రంగు మారిన / విరిగిన గింజలు -2%

7.పూర్తిగా తయారుకాని గింజలు – 6%

8.పురుగుపట్టిన గింజలు – 4%

కొనుగోలు పూర్తయిన తరువాత డబ్బులు ఆధార్‌కు లింక్ చేసిన బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుందని, రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *