కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబును దర్గా పెద్దలు ఆహ్వానించారు. దర్గా పీఠాధిపతి కేఎస్ఎస్ అరీఫుల్లా హుస్సేని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈనెల 24వతేది నుంచి 29 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈసందర్భంగా ఉరుసు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను సీఎం ఆరా తీసినట్లు పీఠాధిపతి తెలిపారు. సీఎంను కలిసిన వారిలో దర్గా మేనేజర్ ఎండీ అలీఖాన్, సయ్యద్ గౌస్, అమీర్ బాషా తదితరులు ఉన్నారు.