ఈశ్వరీ మహాదేవి ఆరాధన గురు పూజ మహోత్సవం

వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లెలో ఈ నెల 11వ తేది నుంచి ఈశ్వరీ మహాదేవి ఆరాధన గురు పూజ మహోత్సవం నిర్వహించనున్నారు. 11న పంచామృతాభిషేకం, కుంకుమార్చన పూజలు, రాత్రి కలశోత్సవం, కలశ స్థాపన ఉత్సవం, 12న పంచామృత అభిషేకం, కుంకుమార్చన పూజలు, అశ్వవాహన ఉత్సవం, రాత్రి హంస వాహన ఉత్సవం, 13న ఈశ్వరీ మహాదేవి సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం సందర్భంగా పంచామృతాభిషేకం, కుంకుమార్చన పూజలు, దీక్షా అలంకరణ ఉత్సవం, సింహ […]
ఈశ్వరీదేవి 322వ జయంతి మహోత్సవం

కాలజ్ఞానకర్త పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ దంపతుల ప్రధమ పుత్రిక ఈశ్వరీ మహాదేవి జయంతి మహోత్సవం ఈనెల 29న వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో నిర్వహించనున్నారు. 1703 స్వభాను నామ సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమి పర్వదినాన అవతరించారు. జయంతి మహోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చన, గుడి ఉత్సవం, గ్రామోత్సవంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని మఠాధిపతి వీర శివకుమార స్వామి తెలిపారు.