Skip to main content

Baskar Pedia

బాపట్ల జిల్లా చీరాలకు చెందిన ప్రముఖకవి, ప్రసిద్ధ కంప్యూటర్ శాస్త్రవేత్త  ఆచార్య అప్పాజోశ్యుల సత్యనారాయణ మహాకవి డాక్టర్ గడియారం వేంకట శేషశాస్త్రి 45వ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఈవిషయాన్ని రచన సాహిత్య వేదిక కార్యదర్శి భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి పేర్కొన్నారు. రచన సాహిత్య వేదిక, గడియారం కుటుంబీకుల సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబరులో ప్రొద్దుటూరులో నిర్వహించే ప్రధాన సభలో పురస్కారం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆచార్య అప్పాజోశ్యుల సత్యనారాయణ రచించిన ‘పంచవటి’ (పంచభూత తారావళులు) అనే పద్యకృతి ఎంపికైనట్లు వివరించారు. అవార్డుతోపాటు  రూ.10వేలు నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. 1982 నుంచి ఏటా ఒక ఉత్తమ కావ్యానికి అవార్డు అందజేస్తూ ఉండగ 2025 సంవత్సరానికి అప్పాజోస్యుల సత్యనారాయణ తారావళి అనే అరుదైన పద్య ప్రక్రియలో చేసిన రచన పంచవటిని ఎంపిక చేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *