Skip to main content

peru-seahorse-162111.hostingersite.com

మహిళలసాధికారత కోసమే మిషన్‌ శక్తి

మహిళల భద్రత, సాధికారతకు కేంద్ర ప్రభుత్వం మిషన్ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో మిషన్ శక్తి కార్యక్రమం అమలుపై జిల్లా స్థాయి మిషన్ శక్తి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ శక్తిలో ‘సంబల్’ మరియు ‘సమర్థ్య’ ఉప పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు వెల్లడించారు. “సంబల్” పథకం మహిళల భద్రతకు, “సమర్థ్య” పథకం మహిళల సాధికారత కోసం ఏర్పాటు చేసిందన్నారు. […]

మైదుకూరు నియోజవర్గ ప్రింట్ మీడియా విలేకరుల సంఘ అధ్యక్షునిగా జి. శ్రీనివాసులు( వాసు) ఏకగ్రీవ ఎన్నిక

       మైదుకూరు నియోజకవర్గ ప్రింట్ మీడియా సమావేశం బుధవారం మైదుకూరులోని ఏ వన్ ఫంక్షన్ హాల్ లో ఘనoగా నిర్వహించారు. సమావేశానికి మైదుకూరు నియోజకవర్గం లోని దువ్వూరు ,చాపాడు,  ఖాజీపేట, బ్రహ్మంగారిమఠం, మైదుకూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రింట్ మీడియా విలేకరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.              గౌరవ అధ్యక్షులుగా యాపరాల వెంకటసుబ్బయ్య ( సాయంకాలం), మైదుకూరు నియోజకవర్గం ప్రింట్ మీడియా […]

ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేయండి

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో  ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ విప్, జమ్మలమడుగు శాసన సభ్యులు సి.ఆదినారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆగస్టు 1న ముఖ్యమంత్రి జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువు గ్రామంలో పెన్షన్ లబ్ధిదారులకు […]

వికసిత భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాకారానికి కృషి

             కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షలకు అనుగుణంగా వికసిత భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాకారానికి కృషి చేయాలని 20 సూత్రాల అమలు కార్యక్రమము ఛైర్మన్ లంకా దినకరన్ పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని పీజాఆర్ఎస్ హాలులో  మండలాల కార్యక్రమాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల పురోగతి, మౌలిక సదుపాయాల కల్పనలో 20 సూత్రాల కార్యక్రమాల అమలు తీరుపై వివిధ శాఖల అధికారులతో ప్రోగ్రామ్ చైర్మన్ లంకా దినకర్ సమీక్ష నిర్వహించారు. ఈ […]

ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 1న జమ్మలమడుగు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సోమవారం జమ్మలమడుగు మండలంలోని పలు ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సి.ఆదినారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పరిశీలించారు. హెలిప్యాడ్ ఏర్పాటుకు ముద్దనూరు రోడ్డులోని అంబవరం పంచాయతీ పరిధి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పక్కనున్న ఖాళీ ప్రాంతాన్ని పరిశీలించారు. హెలిప్యాడ్ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల భద్రత  అంశాలపై జిల్లా […]

క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 27 వ క్యాబినెట్ సమావేశం జరిగింది.  పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ  శాఖామాత్యులు శ్రీ కొలుసు పార్థసారధి  మీడియాకు వివరించారు. కూటమి ప్రభుత్వం లక్ష్యాలను ప్రతిభింబించే విధంగా  క్యాబినెట్ సమావేశం జరిగినట్లు మంత్రి స్పష్టం చేశారు.   సంక్షేమం, అభివృద్ది అనేవి రెండు కళ్లుగా ఈ  […]

200లోపు యూనిట్లు ఉంటేనే ఉచిత విద్యుత్తు

రాష్ట్ర ప్రభుత్వం SC, ST విద్యుత్ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందాలంటే విధిగా ప్రతి నెలా 200 యూనిట్ల లోపు వినియోగం ఉంటేనే వర్తిస్తుందని వైఎస్సార్ కడప జిల్లా  మైదుకూరు  సబ్ డివిజన్ అధికారి శ్రీకాంత్ తెలిపారు.  ఈవిషయాన్ని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు గమనించాలని సూచించారు.  200 యూనిట్లు మించితే ఉచిత విద్యుత్తు వర్తించదని, మొత్తం బిల్లును వినియోగదారుడే భరించాలని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ పథకంపై అవగాహన  కల్పిస్తున్నా ఎక్కువ శాతం SC, […]

గ‌డియారం వేంక‌ట శేష శాస్త్రి

శ‌తాబ్ధపు మ‌హాక‌వుల‌లో గ‌డియారం వేంక‌ట శేష శాస్త్రి గారు ఒక‌రు. శాస్ర్రి గారి శివ‌భారతం మ‌హాకావ్యం మూలంగా చిర‌స్థాయిగా ప్రజ‌ల మ‌న‌స్సుల్లో చోటు చేసుకోగ‌ల‌దంటూ ఆనాటి ముఖ్యమంత్రి అంజ‌య్య త‌న సంతాపంలో పేర్కొన్నారు. ఈయ‌న కాలిగోటికి కూడా మేము స‌రిపోము. ఈయ‌న శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాల‌ని శాస్ర్రి గారి వ‌ర్ధంతి స‌భ‌లో మ‌న పుట్టప‌ర్తి నారాయ‌ణాచార్యులు కోరారు. ఎంద‌రో మ‌హానుభావుల్లో అందులో ఒక‌రైన గ‌డియారం వేంక‌ట శేష శాస్ర్రి మ‌న జిల్లా వాసి అయినందుకు సంతోషించాలి. […]

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం

           క్రీస్తు శకం 1356 లో అప్పటి విజయనగర చక్రవర్తి సంగమ బుక్క రాయలు ఒంటిమిట్టలో కోదండ రామాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అప్పటికి గర్భాలయం అంతరాలయం మాత్రమే ఉండేవి. ఆలయంపైన చిన్న విమాన గోపురం ఉండేది.           ఆ తరువాత ఆలయానికి రెండు మూడు దశల్లో నిర్మాణాలు జరిగాయి. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన శిలలను పరిశీలిస్తే ఈ సంగతి తెలుస్తుంది. అంతరాళ భవనం తరువాత […]

జొన్నవరం వద్ద ఎత్తిపోతల పథకానికి రూ.780కోట్లు మంజూరు

వైఎస్సార్ కాంగ్రెస్ నిర్లక్షం చేసినా వైఎస్సార్ కడపజిల్లా దువ్వూరు మండలం జొన్నవరం వద్ద కుందూనది పై ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. రూ.780కోట్లు నిధుల విడుదలకు అంగీకారం తెలిపింది.  త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడనున్నట్లు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు.   ఎగువన వర్షాలు అనుకూలించక కృష్ణానది పరుగులు తీయక పోయినా కర్నూలు, నంద్యాల జిల్లాలో కురిసే వర్షాలతో కుందూనదిలోకి చేరే నీటిని ఒడిసిపట్టి తెలుగుగంగ కాలువలోకి ఎత్తిపోసేలా ఎత్తిపోతల పథకం   ఏర్పాటుకు […]