Skip to main content

Baskar Pedia

మనం పిలుస్తున్న గండికోటకు పూర్వ పేరు హుండికోట అని మీకు తెలుసా? అవును ఇది నిజమే.   గండికోట ఉత్సవాల సందర్భంగా కడప జిల్లా ఇంటాక్ చాప్టర్  కన్వీనర్ చిన్నపరెడ్డి పర్యవేక్షణలో ఇంటాక్  సభ్యులు, విద్యార్థులతో కలిసి హెరిటేజ్ వాక్ చేస్తున్న సమయంలో ఈ శాసనం వెలుగు చూసింది.  గండికోట మాధవరాయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన శాసనమని, ముస్లిం పాలకులు గండికోట దుర్గాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మాధవరాయ స్వామి ఆలయాన్ని శిథిలం చేసి  ఆలయ  రాతి బండలను  జుమ్మా మసీదు నిర్మాణంలో  వినియోగించి ఉండవచ్చని తాళపత్ర గ్రంథ లిపి నిపుణుడు నాగదాసరి మునికుమార్ అభిప్రాయపడ్డాడు.  ప్రాచీన తెలుగు శిలా శాసనంగా  గుర్తించారు.

కోట పేరు తెలిపే ప్రాచీన తెలుగులిపి  శిలాశాసనం ఐదు వరుసలో రాయబడి ఉంది.  అందులో హుండి కోట అన్ని  రాయబడింది.

శాసన పాఠం

ఒకటో వరుస శ్రీ ముఖ[ నామ] సంవత్సర  మార్గశిర బ 10[హుళ దశమి]లు

రెండో వరుస హుండీ కోట మాధవరాయ

మూడో వరుస స్వామికి కొర[వి] తిరువెంగళ నా

నాలుగో వరుస థ రాజు కొమారుడు  వెంకట

అయిదో వరుస డి[ప]తి నిత్య సదా సెవ గా ఉన్నది.

ఈ శాసనంలో ప్రత్యేకంచి రాయలసీమ  మెదో క్రీడ అయిన ‘బారకట్ట’ అనే పాచికల చిత్రం లెక్కించబడి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *