Skip to main content

peru-seahorse-162111.hostingersite.com

అవును గండికోట కాదు  హుండికోట

మనం పిలుస్తున్న గండికోటకు పూర్వ పేరు హుండికోట అని మీకు తెలుసా? అవును ఇది నిజమే.   గండికోట ఉత్సవాల సందర్భంగా కడప జిల్లా ఇంటాక్ చాప్టర్  కన్వీనర్ చిన్నపరెడ్డి పర్యవేక్షణలో ఇంటాక్  సభ్యులు, విద్యార్థులతో కలిసి హెరిటేజ్ వాక్ చేస్తున్న సమయంలో ఈ శాసనం వెలుగు చూసింది.  గండికోట మాధవరాయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన శాసనమని, ముస్లిం పాలకులు గండికోట దుర్గాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మాధవరాయ స్వామి ఆలయాన్ని శిథిలం చేసి  ఆలయ  […]

గండికోట పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ 

సాస్కి పథకంతో గండికోట పర్యాటక కేంద్రానికి ప్రపంచ స్థాయిలో కీర్తిని ప్రతిబింబించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో గండికోట పర్యాటక అభివృద్ధి పనులపై డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, జిల్లా పర్యాటక శాఖ, ఏపీటీడీసీ అధికారులు, కాంట్రాక్టు ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గండికోట ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి […]

జనవరిలో గండికోట ఉత్సవాలు

వచ్చే ఏడాది జనవరిలో గండికోట ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మొదటి నాలుగు రోజులు ప్రమోషనల్ ఈవెంట్స్, మిగతా మూడు రోజులు ముఖ్యమైన ఈవెంట్స్ నిర్వహించాలని సూచించారు. ముఖ్యమైన ఈవెంట్లలో భాగంగా నిర్వహించే ప్రదర్శనల్లో జాతీయ స్థాయిలో పేరు పొందిన మ్యూజిక్, డాన్స్ బృందాలను ఆహ్వానించాలని పేర్కొన్నారు. గండికోట ఉత్సవాల్లో స్వయం సహాయక గ్రూపు సంఘాలతో జిల్లా స్ట్రీట్ ఫుడ్, ఎగ్జిబిషన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. గండికోట […]