Skip to main content

Baskar Pedia

పుష్పగిరిలో జైనమత ఆనవాళ్ళు

కడప జిల్లా పుష్పగిరిలో 10 శతాబ్దం నాటి జైన పాదుకలు వెలుగు చూసినట్లు రచయిత తవ్వా ఓబులరెడ్డి తెలిపారు. పుష్పగిరి లో వైష్ణవ, శైవ, వీరశైవ, శాక్తేయ, అఘోర, కాపాళిక మత శాఖలకు సంబంధించిన  ఆలయాలకు, చారిత్రక ఆనవాళ్ళకు నిలయంగా ఉండగా తాజాగా  జైన పాదుకల ఆవిష్కరణతో  పుష్పగిరి మత సాంస్కృతిక చరిత్రకు జైనమత ఆనవాళ్లు తోడైనట్లు రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి తెలిపారు.  క్రీ.శ. 10-13 శతాబ్దాల్లో  కర్నాటకలోని గుల్బర్గా సమీపంలోని ‘ ‘మాన్యఖేత’ రాజధానిగా  […]

పుష్పగిరిలో మరో శిలా శాసనం

దక్షిణ కాశిగా పిలువబడుతున్న పుష్పగిరిలో మరో శిలా శాసనం వెలుగుచూసింది. చెన్నకేశవ ఆలయం ముందుభాగంలో ఈశాసనాన్ని చరిత్రకారుడు, రచయిత తవ్వా ఓబులరెడ్డి గుర్తించారు. ‘యనమల చింతల చెన్నరాయునికి’ అని శిలా శాసనంలో చెక్కబడింది. యనమలచింతల గ్రామం కొండాపురం మండలంలో ఉంది. అక్కడ చెన్నకేశవ ఆలయం ఉంది. అయితే ఆ ఆలయం ప్రస్తావన పుష్పగిరిలో చేయబడటం విశేషమని ఓబులరెడ్డి తెలిపారు.

హంపి రాతి రథాన్ని పోలిన రాతి రథం

కర్నూలు జిల్లా మండల కేంద్రం హొళగుందలోని తేరుబజారులో ఎదురు బసవన్న ఆలయం కర్నాటక రాష్ట్రం హంపిలోని రాతి రథాన్ని పోలి ఉంది. నాలుగు పెద్ద రాతి చక్రాలతో ఉన్న బసవన్న ఆలయం ఆకర్షిస్తోంది. గతంలో సిద్ధేశ్వర స్వామి జాతర సందర్భంగా రాతి రథాన్ని లాగేవారని, దాదాపు 200ఏళ్ల కిందట రథ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. కర్నాటక రాష్ట్రంలో శ్రీకృష్ణదేవరాయలు ఏలిన విజయనగర సామ్రాజ్యంలో హంపి ఉండటం… మండల కేంద్రం హొళిగుంద కర్నాటక సరిహద్దులో ఉండటమే కాకుండా రాయలు […]

రేకులకుంట వద్ద వెలుగులోకి 18వ శతాబ్దం నాటి విగ్రహం

వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట ఎస్సీకాలనీ దక్షిణ దిశలో  18వ శతాబ్దం నాటి విగ్రహం విగ్రహం వెలుగులోకి వచ్చింది. ఇది ఒక మహిళా విగ్రహం. ఎడమవైపు కొప్పు ధరించి, మెడలో పెండెంట్ (పతకo) ధరించి,  ఎడమవైపు చేతిలో ఒక చంటి పిల్లోడిని నడుముకు కట్టుకొని కనిపిస్తోంది. కుడివైపు చేతిలో ఒక పుష్పం, నడుము నుంచి వస్త్రాదరణ చేసినట్టు . కాళ్లకు, చేతులకు కడియాలు ధరించిన్నట్లు చిత్రీకరించారన్నారు. చెవులు చాలా పెద్దవిగా ఉన్నాయి. కడప యోగివేమన విశ్వవిద్యాలయ […]

సుంకేశుల నుంచి కృష్ణాపురం వరకు

కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాలో కేసీకాలువ ఆయకట్టు కింద కర్నూలు, నంద్యాల జిల్లాలో 173627ఎకరాలు, కడప జిల్లాలో 92,001  ఎకరాలకు సాగునీరు అందాలి. అయితే కాలువకు సాగునీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహించాలో తెలుసుకుందాం. సుంకేశుల ఆనకట్ట నుంచి లాకెన్సుల వరకు (0.000కి.మీ నుంచి 120.19కి.మీ) 120.19కి.మీ లాకెన్సుల నుంచి సంతజూటూరు వరకు (120.19కి.మీ నుంచి 150.65కి.మీ) 30.46కి.మీ సంతజూటూరు ఆనకట్ట నుంచి రాజోలి ఆనకట్ట వరకు (150.65కి.మీ నుంచి 234.64కి.మీ) 83.99కి.మీ రాజోలి […]

బాపూజీ సిద్ధాంతాలతో ప్రభావితం

వందేమాతరం అంటూ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా నడిచిన నాయకుల్లో బ్రహ్మంగారిమఠం ఓబులరాజుపల్లె గ్రామానికి చెందిన బొమ్ము రామారెడ్డి ఒకరు.  జ‌న‌నం : 1914 మ‌ర‌ణం : 1985 జ‌న‌వ‌రి 1 గ్రామం : ఓబుల‌రాజుప‌ల్లె, మండ‌లం : బి.మ‌ఠం, త‌ల్లి : సుబ్బమ్మ, తండ్రి : పెద్దవీరారెడ్డి, విద్య : స్వగ్రామంలో ప్రాధ‌మిక విద్య, బ‌ద్వేలు చియ్యపాడులో ఉన్నత విద్య, ప్రొద్దుటూరులో ఎస్ఎస్ఎల్‌సీ, మ‌ద్రాసు ల‌యోలా క‌ళాశాల‌లో పైచ‌దువ‌లు, స‌హ‌చ‌ర విద్యార్థులు : నీలం సంజీవ‌రెడ్డి, కాసు […]

ఎస్.పి.నాగిరెడ్డి

శెట్టిపల్లె పెద్ద నాగిరెడ్డి. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పెదనాన్న. చాపాడు మండలం నక్కలదిన్నె గ్రామానికి చెందిన పెద్దనాగిరెడ్డి 18వ ఏటనే అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడిగా చేరి ప్రొద్దుటూరు తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర, జిల్లా సభ్యుడిగా ప్రొద్దుటూరు పరిధిలోని ఓబాయపల్లి పంచాయతీ బోర్డు అధ్యక్షుడుగా మూడుసార్లు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. 1959లో మైదుకూరు పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1967 ఫిబ్రవరి నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో  మైదుకూరు నియోజకవర్గం నుంచి […]