లంకమలలో చింకారా

జింక జాతుల్లో అరుదైనది చింకారా (ఇండియన్ గజల్) ఒకటి. లంకమల అభయారణ్యంలోని సిద్ధవటం రేంజి పరిధిలో కొండూరు బీటు మచ్చాయకుంట అటవీ ప్రాంతంలో అమర్చిన కెమెరాకు చిక్కింది. అటవీ అధికారులు ఆప్రాంతానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. అంతరించి పోతున్న అరుదైన వన్యప్రాణుల్లో చింకారా ఒకటని అధికారులు స్పష్టం చేశారు.
రంగురంగుల లకుముకి పిట్టలు

సాగునీటి పారుదల కలిగిన కేసీకాలువ ఆయకట్టు ప్రాంతంలో లకుముకి పిట్టలు (కింగ్ ఫిషర్) కనిపిస్తున్నాయి. చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్నాయి. చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
విదేశీ పక్షులు..గాంధీనగర్ అతిథులు

ఎర్రకాళ్లు.. నల్లరంగు ఈకలతో రెక్కలు…ఊదారంగు ముక్కుతో ఉన్న పక్షులు వైఎస్సార్ కడప జిల్లా చాపాడు మండలం గాంధీనగర్ గ్రామానికి తరలివచ్చాయి. సంతానోత్పత్తి కోసం వేల కి.మీ ప్రయాణించి చేరుకున్న విదేశీ పక్షులు ఏటా జూన్ నెలలో చేరుకుంటాయి. సంతానంతో డిసెంబరు ఆఖరునాటికి తిరిగి వెళ్లిపోనున్నాయి. ఒకవైపు కుందూనది మరోవైపు పెన్నానది ఇంకోవైపు పాపాఘ్ని నదులు ఆహార వేటకు అనుకూలంగా ఉండటంతో గాంధీనగర్ గ్రామానికి ఏటా పక్షులు తరలి వస్తున్నాయి. గ్రామానికి చేరుకున్న పక్షులను వేటగాళ్ల బారిన పడకుండా […]
ఆ ఊరి నేస్తాలు గబ్బిలాలు

చెట్ల కొమ్మలను అంటిపెట్టుకుని తలకిందులుతూ వేలాడుతూ కనిపించే గబ్బిలాలు వైఎస్సార్ కడప జిల్లా డయాంఖానపల్లెలో రామాలయం వద్ద కనిపిస్తున్నాయి. వందలాది పక్షులు దశాబ్దాలుగా గ్రామాన్ని అంటి పెట్టుకుని ఉన్నాయి. చీకటి పడగానే ఆహారం కోొసం వెళ్లిపోయే ఈ గబ్బిలాలు అర్ధరాత్రి వరకు తిరిగి చెట్టు వద్దకు చేరుకుని కనిపిస్తాయి. గబ్బిలాలను గ్రామస్తులు దేవతా పక్షులుగా భావించి వేటగాళ్ల బారి నుంచి కాపాడుతున్నారు. గ్రామస్తులు వీటిని గవాజీ పక్షులుగా కొన్నిచోట్ల చీకిరేవులుగా పిలుస్తూ ఉంటారు.