Skip to main content

Baskar Pedia

పూలసుబ్బయ్య

పూల సుబ్బయ్య

కమ్యూనిస్టు ఉద్యమం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలతో అనుబంధం పెంచుకున్న నాయకుడు పూల సుబ్బయ్య. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం ప్రాంతంలో రాజకీయ ప్రాతినిథ్యం వహించిన సుబ్బయ్య కంభంలో 1929 జూన్ 4న జన్మించారు. 1988జూన్ 23న కన్నుమూశారు.  1952లో కంభం పంచాయతీ వార్డు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి చెందిన పూల సుబ్బయ్య ఆతరువాత మార్కాపురం చేరుకుని న్యాయవాదిగా పనిచేస్తూ ప్రజలతో సంబంధాలను పెంచుకున్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. మార్కాపురం, యర్రగొండపాలెం, ప్రకాశం ప్రాంతాలు […]

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి

     ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. 1949 జూలై 8. జమ్మలమడుగు సి.ఎస్.ఐ. క్యాంబెల్ మిషన్ ఆసుపత్రిలో జ‌న్మించారు. రాజ‌శేఖ‌ర‌రెడ్డి తండ్రి రాజారెడ్డి క‌ర్నాట‌క రాష్ట్రంలోని బళ్ళారిలో గుత్తేదారుగా పనిచేస్తుండటంతో రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాఠశాల చ‌దువు బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. విజయవాడ లయోలా కళాశాలలో చేరారు. 1972లో గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవిద్యలో పట్టా తీసుకున్నారు.  వైద్యవృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాలలో విద్యార్ధి సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు.తిరుప‌తిలోని వెంకటేశ్వర వైద్యకళాశాల నుంచి హౌస్‌సర్జన్ పట్టా […]

డి.ఎల్.రవీంద్రారెడ్డి

            రాజ‌కీయాల్లో సుదీర్ఘ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుల్లో ర‌వీంద్రారెడ్డి ఒక‌రు. అటు పార్టీలోనూ ఇటు ప‌లు ముఖ్యమంత్రుల వ‌ద్ద మంత్రివ‌ర్గంలోనూ ప‌ద‌వులు నిర్వహించి త‌న‌కు తానే సాటిగా విభిన్నశైలిలో న‌డుస్తున్న నాయ‌కుడిగా ర‌వీంద్రారెడ్డిని చెప్పవ‌చ్చు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మనుగడ లేదని గుర్తించి 2014 ఎన్నికలకు దూరమై రాజకీయ చతురతను ప్రదర్శించారు. అప్పట్లో పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల నాటికి వైఎస్సార్ […]

బాపూజీ సిద్ధాంతాలతో ప్రభావితం

వందేమాతరం అంటూ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా నడిచిన నాయకుల్లో బ్రహ్మంగారిమఠం ఓబులరాజుపల్లె గ్రామానికి చెందిన బొమ్ము రామారెడ్డి ఒకరు.  జ‌న‌నం : 1914 మ‌ర‌ణం : 1985 జ‌న‌వ‌రి 1 గ్రామం : ఓబుల‌రాజుప‌ల్లె, మండ‌లం : బి.మ‌ఠం, త‌ల్లి : సుబ్బమ్మ, తండ్రి : పెద్దవీరారెడ్డి, విద్య : స్వగ్రామంలో ప్రాధ‌మిక విద్య, బ‌ద్వేలు చియ్యపాడులో ఉన్నత విద్య, ప్రొద్దుటూరులో ఎస్ఎస్ఎల్‌సీ, మ‌ద్రాసు ల‌యోలా క‌ళాశాల‌లో పైచ‌దువ‌లు, స‌హ‌చ‌ర విద్యార్థులు : నీలం సంజీవ‌రెడ్డి, కాసు […]

ఎస్.పి.నాగిరెడ్డి

శెట్టిపల్లె పెద్ద నాగిరెడ్డి. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పెదనాన్న. చాపాడు మండలం నక్కలదిన్నె గ్రామానికి చెందిన పెద్దనాగిరెడ్డి 18వ ఏటనే అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడిగా చేరి ప్రొద్దుటూరు తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర, జిల్లా సభ్యుడిగా ప్రొద్దుటూరు పరిధిలోని ఓబాయపల్లి పంచాయతీ బోర్డు అధ్యక్షుడుగా మూడుసార్లు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. 1959లో మైదుకూరు పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1967 ఫిబ్రవరి నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో  మైదుకూరు నియోజకవర్గం నుంచి […]