గండికోటకు కృష్ణాజలాల చేరిక

నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయరు నుంచి వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట జలాశయానికి కృష్ణా జలాలు చేరుతున్నాయి. 2026 ఆగస్టు 30వతేది రాత్రి నీటి చేరిక ప్రారంభమైంది. అవుకు జలాశయం నుంచి 57కి.మీ జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా ప్రవహించి గండికోట సొరంగం ద్వారా గండికోట ప్రాజెక్టులోకి 3300క్యూసెక్కులు నీరు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. 26.850టీఎంసీలు సామర్థ్యం కలిగిన జలాశయంలో ప్రస్తుతం 12.686టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి 21.744టీఎంసీలు ఉండేవి.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

వెలిగొండ ప్రాజెక్టు కోసం పోరాటం చేసిన కమ్యూనిస్టు నాయకుడు, మార్కాపురం, యర్రగొండిపాలె నియోజకవర్గాల నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పూల సుబ్బయ్య పేరును పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా నామకరం చేశారు. కృష్ణా వరద జలాలను జంట సొరంగాల ద్వారా మళ్లించి ఫీడర్ కాలువ ద్వారా నల్లమలసాగర్ జలాశయంలో 53.85టీఎంసీలు నిల్వ చేస్తారు. జలాశయం నుంచి తీగలేరు కాలువ, గొట్టిపడియ కాలువ, తూర్పు ప్రధాన కాలువల ద్వారా 4,47,300ఎకరాలకు నీరు సరఫరా చేస్తారు. ప్రకాశం జిల్లాలో 3మండలాలు, మార్కాపురం […]
పూలసుబ్బయ్య

కమ్యూనిస్టు ఉద్యమం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలతో అనుబంధం పెంచుకున్న నాయకుడు పూల సుబ్బయ్య. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం ప్రాంతంలో రాజకీయ ప్రాతినిథ్యం వహించిన సుబ్బయ్య కంభంలో 1929 జూన్ 4న జన్మించారు. 1988జూన్ 23న కన్నుమూశారు. 1952లో కంభం పంచాయతీ వార్డు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి చెందిన పూల సుబ్బయ్య ఆతరువాత మార్కాపురం చేరుకుని న్యాయవాదిగా పనిచేస్తూ ప్రజలతో సంబంధాలను పెంచుకున్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. మార్కాపురం, యర్రగొండపాలెం, ప్రకాశం ప్రాంతాలు […]
మైలవరం జలాశయం

పరివాహక ప్రాంతం 19197 చదరపు మైళ్లు FRL వద్ద నీటి వ్యాప్తి ప్రాంతం 41 చదరపు నిల్వ సామర్థ్యం 9.985 టీఎంసీలు ప్రత్యక్ష నిల్వ సామర్థ్యం 8.97 టీఎంసీలు గరిష్ట వరద విడుదల 8180 క్యూమెక్స్ FRL +202.65 M MWL +202.65 M TBL +205.750 మట్టికట్ట పొడవు 2484.1 మీటర్లు మట్టి కట్ట గరిష్ట ఎత్తు 24మీటర్లు Spill మార్గం యొక్క పొడవు 195.10 M గేట్ల సంఖ్య 13 ఎడమ కాలువ పొడవు […]
జొన్నవరం వద్ద ఎత్తిపోతల పథకానికి రూ.780కోట్లు మంజూరు

వైఎస్సార్ కాంగ్రెస్ నిర్లక్షం చేసినా వైఎస్సార్ కడపజిల్లా దువ్వూరు మండలం జొన్నవరం వద్ద కుందూనది పై ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. రూ.780కోట్లు నిధుల విడుదలకు అంగీకారం తెలిపింది. త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడనున్నట్లు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. ఎగువన వర్షాలు అనుకూలించక కృష్ణానది పరుగులు తీయక పోయినా కర్నూలు, నంద్యాల జిల్లాలో కురిసే వర్షాలతో కుందూనదిలోకి చేరే నీటిని ఒడిసిపట్టి తెలుగుగంగ కాలువలోకి ఎత్తిపోసేలా ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు […]
సుంకేశుల నుంచి కృష్ణాపురం వరకు

కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాలో కేసీకాలువ ఆయకట్టు కింద కర్నూలు, నంద్యాల జిల్లాలో 173627ఎకరాలు, కడప జిల్లాలో 92,001 ఎకరాలకు సాగునీరు అందాలి. అయితే కాలువకు సాగునీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహించాలో తెలుసుకుందాం. సుంకేశుల ఆనకట్ట నుంచి లాకెన్సుల వరకు (0.000కి.మీ నుంచి 120.19కి.మీ) 120.19కి.మీ లాకెన్సుల నుంచి సంతజూటూరు వరకు (120.19కి.మీ నుంచి 150.65కి.మీ) 30.46కి.మీ సంతజూటూరు ఆనకట్ట నుంచి రాజోలి ఆనకట్ట వరకు (150.65కి.మీ నుంచి 234.64కి.మీ) 83.99కి.మీ రాజోలి […]
ప్రపంచ వారసత్వ నీటి పారుదల కట్టడంగా కేసీకాలువ

ప్రపంచ చారిత్రక నీటిపారుదల కట్టడంగా అతి పురాతనమైన కర్నూలు-కడప కాలువ (కేసీకాలువ) గుర్తింపు పొందింది. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ సంస్థ న్యాయ నిర్ణేతల బృందం పరిశీలించి ఎంపిక చేసింది. 2024లో దేశంలోని నాలుగు ప్రాజెక్టులను ఎంపిక చేయగా అందులో కేసీకాలువ ఒకటి. ** ఇది కేసీకాలువ చరిత్ర భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో కేసీకాల్వ ఒకటి. కర్నూలు జిల్లాలో 1,73,627ఎకరాలకు, కడప జిల్లాలో 92,001ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రధాన నీటి వనరు. అతి పురాతనమైన […]
జొన్నవరం వద్ద ఎత్తిపోతలకు రూ.780కోట్లు మంజూరు

వైఎస్సార్ కాంగ్రెస్ నిర్లక్షం చేసినా వైఎస్సార్ కడపజిల్లా దువ్వూరు మండలం జొన్నవరం వద్ద కుందూనది పై ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. రూ.780కోట్లు నిధుల విడుదలకు అంగీకారం తెలిపింది. త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. ఎగువన వర్షాలు అనుకూలించక కృష్ణానది పరుగులు తీయక పోయినా కర్నూలు, నంద్యాల జిల్లాలో కురిసే వర్షాలతో కుందూనదిలోకి చేరే నీటిని ఒడిసిపట్టి తెలుగుగంగ కాలువలోకి ఎత్తిపోసేలా ఎత్తిపోతల పథకం […]