ఆ ఊరి నేస్తాలు గబ్బిలాలు

చెట్ల కొమ్మలను అంటిపెట్టుకుని తలకిందులుతూ వేలాడుతూ కనిపించే గబ్బిలాలు వైఎస్సార్ కడప జిల్లా డయాంఖానపల్లెలో రామాలయం వద్ద కనిపిస్తున్నాయి. వందలాది పక్షులు దశాబ్దాలుగా గ్రామాన్ని అంటి పెట్టుకుని ఉన్నాయి. చీకటి పడగానే ఆహారం కోొసం వెళ్లిపోయే ఈ గబ్బిలాలు అర్ధరాత్రి వరకు తిరిగి చెట్టు వద్దకు చేరుకుని కనిపిస్తాయి. గబ్బిలాలను గ్రామస్తులు దేవతా పక్షులుగా భావించి వేటగాళ్ల బారి నుంచి కాపాడుతున్నారు. గ్రామస్తులు వీటిని గవాజీ పక్షులుగా కొన్నిచోట్ల చీకిరేవులుగా పిలుస్తూ ఉంటారు.

Read More..

ఆదిమానవుని స్థావరం

అలనాటి కట్టడాలు.. నిర్మించిన కోనేరులు…  శిల్ప సంపద.  ఇవన్నీ ప్రాచీన చరిత్రకు సాక్ష్యాలుగా చెప్పవచ్చు. దువ్వూరు మండలం పెద్దభాకరాపురం సమీపంలో గణాద్రిస్వామి గుట్టగా పిలవబడే గుట్టలపై ఆది మానవుడు సంచరించాడని చెప్పడానికి అక్కడ కనిపించే శిలా చిత్ర లేఖనాలు సాక్షాలుగా  నిలుస్తున్నాయి. కొండపై మానవుని పాదాలు, ఎడ్లు, నంది పాదం, ఆయుధం, వ్యవసాయ పనిముట్లు, జంతువులు ఇలా పలు శిల్పిన చిత్ర లేఖనాలు గణాద్రిస్వామి గుట్టపై కనిపిస్తున్నాయి.  సంరక్షణ దిశగా చర్యలు కరవయ్యాయి.  స్థానికులు గుట్టపై రాళ్ల…

Read More..