ఒంటిమిట్ట ఆలయ నిర్మాణం

క్రీ.శ. 1356లో అప్పటి విజయనగర చక్రవర్తి సంగమ బుక్కరాయలు ఒంటిమిట్టలో కోదండ రామాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అప్పటికి గర్భాలయం, అంతరాలయం, ఆలయంపైన చిన్న విమాన గోపురం ఉండేది. ఆ తరువాత ఆలయానికి రెండు, మూడు దశల్లో నిర్మాణాలు జరిగాయి. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన శిలలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. అంతరాళ భవనం తరువాత ముఖ మంటపం నిర్మించారు. ఇందుకోసం ఉపయోగించిన శిలలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ ముఖ మంటపం ఎవరు నిర్మించారో […]
అవును గండికోట కాదు హుండికోట

మనం పిలుస్తున్న గండికోటకు పూర్వ పేరు హుండికోట అని మీకు తెలుసా? అవును ఇది నిజమే. గండికోట ఉత్సవాల సందర్భంగా కడప జిల్లా ఇంటాక్ చాప్టర్ కన్వీనర్ చిన్నపరెడ్డి పర్యవేక్షణలో ఇంటాక్ సభ్యులు, విద్యార్థులతో కలిసి హెరిటేజ్ వాక్ చేస్తున్న సమయంలో ఈ శాసనం వెలుగు చూసింది. గండికోట మాధవరాయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన శాసనమని, ముస్లిం పాలకులు గండికోట దుర్గాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మాధవరాయ స్వామి ఆలయాన్ని శిథిలం చేసి ఆలయ […]
పుష్పగిరిలో జైనమత ఆనవాళ్ళు

కడప జిల్లా పుష్పగిరిలో 10 శతాబ్దం నాటి జైన పాదుకలు వెలుగు చూసినట్లు రచయిత తవ్వా ఓబులరెడ్డి తెలిపారు. పుష్పగిరి లో వైష్ణవ, శైవ, వీరశైవ, శాక్తేయ, అఘోర, కాపాళిక మత శాఖలకు సంబంధించిన ఆలయాలకు, చారిత్రక ఆనవాళ్ళకు నిలయంగా ఉండగా తాజాగా జైన పాదుకల ఆవిష్కరణతో పుష్పగిరి మత సాంస్కృతిక చరిత్రకు జైనమత ఆనవాళ్లు తోడైనట్లు రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి తెలిపారు. క్రీ.శ. 10-13 శతాబ్దాల్లో కర్నాటకలోని గుల్బర్గా సమీపంలోని ‘ ‘మాన్యఖేత’ రాజధానిగా […]
పుష్పగిరిలో మరో శిలా శాసనం

దక్షిణ కాశిగా పిలువబడుతున్న పుష్పగిరిలో మరో శిలా శాసనం వెలుగుచూసింది. చెన్నకేశవ ఆలయం ముందుభాగంలో ఈశాసనాన్ని చరిత్రకారుడు, రచయిత తవ్వా ఓబులరెడ్డి గుర్తించారు. ‘యనమల చింతల చెన్నరాయునికి’ అని శిలా శాసనంలో చెక్కబడింది. యనమలచింతల గ్రామం కొండాపురం మండలంలో ఉంది. అక్కడ చెన్నకేశవ ఆలయం ఉంది. అయితే ఆ ఆలయం ప్రస్తావన పుష్పగిరిలో చేయబడటం విశేషమని ఓబులరెడ్డి తెలిపారు.
హంపి రాతి రథాన్ని పోలిన రాతి రథం

కర్నూలు జిల్లా మండల కేంద్రం హొళగుందలోని తేరుబజారులో ఎదురు బసవన్న ఆలయం కర్నాటక రాష్ట్రం హంపిలోని రాతి రథాన్ని పోలి ఉంది. నాలుగు పెద్ద రాతి చక్రాలతో ఉన్న బసవన్న ఆలయం ఆకర్షిస్తోంది. గతంలో సిద్ధేశ్వర స్వామి జాతర సందర్భంగా రాతి రథాన్ని లాగేవారని, దాదాపు 200ఏళ్ల కిందట రథ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. కర్నాటక రాష్ట్రంలో శ్రీకృష్ణదేవరాయలు ఏలిన విజయనగర సామ్రాజ్యంలో హంపి ఉండటం… మండల కేంద్రం హొళిగుంద కర్నాటక సరిహద్దులో ఉండటమే కాకుండా రాయలు […]
రేకులకుంట వద్ద వెలుగులోకి 18వ శతాబ్దం నాటి విగ్రహం

వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట ఎస్సీకాలనీ దక్షిణ దిశలో 18వ శతాబ్దం నాటి విగ్రహం విగ్రహం వెలుగులోకి వచ్చింది. ఇది ఒక మహిళా విగ్రహం. ఎడమవైపు కొప్పు ధరించి, మెడలో పెండెంట్ (పతకo) ధరించి, ఎడమవైపు చేతిలో ఒక చంటి పిల్లోడిని నడుముకు కట్టుకొని కనిపిస్తోంది. కుడివైపు చేతిలో ఒక పుష్పం, నడుము నుంచి వస్త్రాదరణ చేసినట్టు . కాళ్లకు, చేతులకు కడియాలు ధరించిన్నట్లు చిత్రీకరించారన్నారు. చెవులు చాలా పెద్దవిగా ఉన్నాయి. కడప యోగివేమన విశ్వవిద్యాలయ […]
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం

క్రీస్తు శకం 1356 లో అప్పటి విజయనగర చక్రవర్తి సంగమ బుక్క రాయలు ఒంటిమిట్టలో కోదండ రామాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అప్పటికి గర్భాలయం అంతరాలయం మాత్రమే ఉండేవి. ఆలయంపైన చిన్న విమాన గోపురం ఉండేది. ఆ తరువాత ఆలయానికి రెండు మూడు దశల్లో నిర్మాణాలు జరిగాయి. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన శిలలను పరిశీలిస్తే ఈ సంగతి తెలుస్తుంది. అంతరాళ భవనం తరువాత […]
పుష్పగిరి కొండపై కాకతీయుల కాలం నాటి ఆలయం

వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు మండలంలోని పుష్పగిరి క్షేత్రం వద్ద కాకతీయుల కాలం నాటి పుష్పాచలేశ్వర ఆలయం ఉంది. దుర్గాదేవి ఆలయానికి ఈశాన్యంలో కొండపై వందల ఏళ్ల కిందట నిర్మించిన ఆలయం ఉన్నట్లు రచయిత, చరిత్రకారుడు తవ్వా ఓబులరెడ్డి తెలిపారు. నడిగట్టు ఆలయంగా పూర్వం పూజలు చేసేవారు. కాకతీయుల వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించిన ఆలయం హరిహర క్షేత్రంగా వెలుగొందింది. ఆలయంలో ఉమామహేశ్వరుడు, లక్ష్మీనారాయణ స్వామి, సుబ్రహ్మణ్యుడు, విఘ్నేశ్వరుడి విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు మెకంజీ అధ్యయనం చెబుతోంది. 12వ […]
కాకతీయుల గణపతిదేవుని కాలంనాటి విగ్రహం

ఓరుగల్లు రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాకతీయ గణపతిదేవుని కాలంనాటి శిలా విగ్రహం (వీరగల్లు) ఒకటి దువ్వూరు మండలం రాంసాయినగర్ సమీపంలో గుర్తించారు. రాంసాయినగర్ దక్షిణ దిశలో మూడిండ్లపల్లె గ్రామానికి చెందిన మంచాల సుబ్బిరెడ్డి పొలంలో విగ్రహం బయటపడిన విషయం తెలుసుకున్న పురావస్తు శాస్త్రవేత్త శేగినేని వెంకట శ్రీనివాసులు ఆయన శిష్యుడు రంగస్వామిలు పరిశీలించారు. శేగినేని వెంకట శ్రీనివాసులు భాస్కర్ పీడియాతో మాట్లాడుతూ గణపతిదేవుని కుమార్తె రాణిరుద్రమదేవి యుద్ధ విజేతగా అశ్వంపై వెళ్తున్నట్లుగా ఉందని, వాటివెనుకే రాజలాంఛనం వరాహం, […]
ప్రపంచ వారసత్వ నీటి పారుదల కట్టడంగా కేసీకాలువ

ప్రపంచ చారిత్రక నీటిపారుదల కట్టడంగా అతి పురాతనమైన కర్నూలు-కడప కాలువ (కేసీకాలువ) గుర్తింపు పొందింది. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ సంస్థ న్యాయ నిర్ణేతల బృందం పరిశీలించి ఎంపిక చేసింది. 2024లో దేశంలోని నాలుగు ప్రాజెక్టులను ఎంపిక చేయగా అందులో కేసీకాలువ ఒకటి. ** ఇది కేసీకాలువ చరిత్ర భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో కేసీకాల్వ ఒకటి. కర్నూలు జిల్లాలో 1,73,627ఎకరాలకు, కడప జిల్లాలో 92,001ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రధాన నీటి వనరు. అతి పురాతనమైన […]