Skip to main content

Baskar Pedia

జీవీసత్రం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా

కడప జిల్లా మైదుకూరు మండలం జీవీసత్రం సమీపంలో 67వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం  ఆర్టీసీ కడప డిపోకు చెందిన బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. విజయవాడ నుంచి కడపకు వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు మార్గమధ్యంలోని జీవీసత్రం వద్ద బైపాస్ పైకి చేరుకుంది.  జీవీసత్రంలో దిగాల్సిన ప్రయాణికులు ఉండటంతో బైపాస్ నుంచి జీవీసత్రం వైపు బస్సును మళ్లించారు. దాదాపు 2 అడుగుల ఎత్తు నుంచి బస్సు జీవీసత్రం దారిలోకి మళ్లే సమయంలో అదుపుతప్పి […]

ఉల్లి రైతులకు నష్టం వాటిల్లకుండా మార్కెటింగ్

ఉల్లి రైతులకు నష్టం వాటిల్లకుండా మార్కెటింగ్ చేపట్టేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జేసీ అదితి సింగ్ తో కలిసి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి పంట కొనుగోలుకు సంబంధించి జిల్లాలోని ఉల్లి ట్రేడర్లతో సమావేశం ఏర్పాటు చేసి, ఉల్లి కొనుగోలుపై సలహాలు సూచనలు ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న రైతుల నుంచి అధిక లాభాలను ఆశించరాదని  ట్రేడర్లకు సూచించారు. నష్టాల బాటలో […]

జిల్లా కలెక్టరును కలిసిన ఎస్పీ

జిల్లా ఎస్పీగా వచ్చిన షెల్కే నచికేత్ విశ్వనాథ్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ను  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం  అందజేశారు.

ఉద్యోగ ఉపాధ్యాయులను వంచెనకు గురిచేయొద్దు

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్టోపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిలర్  కూశెట్టి పాలకొండయ్య,  జిల్లా ఆర్థిక కార్యదర్శి గోశెట్టి రామమోహన్ డిమాండ్ చేశారు. ఆర్థిక పరమైన హామీల విషయంలో ఉద్యోగ ఉపాధ్యాయులను  వంచెనకు గురి చేయొద్దని కోరారు.  వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులోని విద్యాశాఖ కార్యాలయం వద్ద రాష్టోపాధ్యాయ సంఘం ఆధ్వర్యం లో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలాగా నేటి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులను మోసపుచ్చుతూ  హామీల అమలులో […]

తుడుమలదిన్నె రైతుకు చేయూత

జీవనాధారానికి మూలమైన ఎడ్లను కోల్పోయి కుంగిపోయిన వైఎస్సార్ కడప జిల్లా తుడుమలదిన్నెకు చెందిన రైతు ఆదిరెడ్డికి ఏపీఐఐసీ మాజీ డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి రూ. 50,000  ఆర్థిక సహాయం అందించి  చేయూత నిచ్చారు.  ఇటీవల గ్రామం వద్ద ఎడ్లబండితో వాగును దాటుతున్న సమయంలో ప్రవాహానికి కొట్టుకొని పోయి ఎడ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. రైతును ఆదుకునేందుకు తనవంతు సహాయాన్ని గంగాధర్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో వైకాపా నేతలు ఇరగంరెడ్డి నాగేశ్వర్ రెడ్డి , ఆంజనేయ […]

రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం

తెలుగు పద్య పఠనంలో వైఎస్సార్ కడప  జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలోని జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల బాలిక వీరమల్ల గౌరి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు.  వెనుకబడిన తరగతుల సంక్షేమ సంస్థ ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన పోటీలో గౌరి ప్రతిభను ప్రదర్శించారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. బాలిక గౌరిని ప్రిన్సిపాల్ నిర్మల అభినందించారు.

సాంకేతికతకు మూల పురుషుడు

కులవృత్తి గొప్పదనాన్ని, వైభవాన్ని, ప్రభావాన్ని, జీవనాధారాన్ని పెంపొందించడమే.. సాంకేతికతకు మూలపురుషుడైన శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని పిజీఆర్ఎస్ హాలులో  జిల్లా బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ జయంతి వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రపంచ తొలి వాస్తు శిల్పి, సృష్టికర్తగా.. ప్రవచనకారులు దేవశిల్పి విశ్వకర్మను ప్రస్తావించడం సమంజసమైనదన్నారు.  కేంద్ర రాష్ట్ర […]

భూ సమస్యల ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం చూపాలి

భూ సంబంధిత అర్జీదారులు, ఫిర్యాదుదారుల అర్జీల పట్ల భాధ్యతాయుతంగా వ్యవహరించి త్వరితగతిన పరిష్కరించాలని  జిల్లా ఇంఛార్జి కలెక్టర్, జేసీ అదితి సింగ్ అధికారులకు సూచించారు.  కలెక్టరేట్ లోని సభాభవన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) లో వచ్చిన ఫిర్యాదులపై  డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్రమోహన్, చిన్నయ్య, సర్వే ల్యాండ్స్ ఏడీ మురళీ కృష్ణ , మండలాల తహశీల్దార్లు, ఆర్ఐ, ఎంపిడివోలతో కలిసి సమీక్షా […]

ఉల్లి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి  

జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా ఇప్పటికే ప్రారంభమైన మైదుకూరు, కమలాపురం ఉల్లి కొనుగోలు కేంద్రాలను  రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో రైతుల నుంచి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి కొనుగోలు ప్రక్రియపై. ఉద్యాన, మార్క్ ఫెడ్ శాఖల అధికారులతో సమీక్షించారు.  క్వింటాల్ ఉల్లి ధర రూ.1200 /- ప్రకారం e-క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుంచి మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం ఉల్లి పంటను కొనుగోలు చేయడం […]

ప్రజల అప్రమత్తతోనే చైన్ స్నాచింగ్, చోరీలకు అడ్డుకట్ట

చైన్ స్నాచింగ్, చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైదుకూరు అర్బన్ సర్కిల్ ఇన్ స్పెక్టరు కె.రమణారెడ్డి తెలిపారు. పోలీసు సూచనలు పాటించాలని కోరారు. మీరు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో,  చుట్టు పక్కల ఎవరైనా అనుమానస్పంగా కొత్త వ్యక్తులు తిరుగుతుంటే వెంటనే 112 పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలన్నారు. బంగారు ఆభరణములు ధరించి మహిళలు ఒంటరిగా వాకింగ్ కు గాని నిర్మానుష్యమైన ప్రదేశం  కు వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవ్వరైనా […]