Skip to main content

Baskar Pedia

ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాల బహూకరణ

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కడప జిల్లా పోలీసు పెరేడ్ ప్రాంగణంలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందిస్తున్న  మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్, పక్కన జిల్లా కలెక్టరు చెరుకూరి శ్రీధర్, జేసీ అదితి సింగ్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  

జిల్లాలో ఘనంగా “స్త్రీ శక్తి” పథకం ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “స్త్రీ శక్తి” పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని శుక్రవారం మధ్యాహ్నం కడప ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ప్రారంభించారు.  రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రత్యేకంగా అలంకరించిన పలు […]

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెదేపా విజయం

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్థి మా రెడ్డి లతారెడ్డి విజయం సాధించారు.  మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాఖాలోనే  తెదేపా అభ్యర్థి విజయం సాధించడంతో ఆపార్టీ నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.  తెదేపా అభ్యర్థి లతారెడ్డికి 6713 ఓట్లు లభించగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు లభించాయి. 

ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నిక

ఒంటి మిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం నందు ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లో నిల్చున్న ఓటర్లు

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక

పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికకు సంబంధించి ఎర్రబల్లి ప్రాథమిక పాఠశాల లలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం బూత్ నెంబర్లు- 9,10 లలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లో నిల్చున్న ఓటర్లు    

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

రోడ్డు భద్రత చర్యలను జిల్లాలో మరింత కఠినతరం చేసి రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబందిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని బోర్డు రూమ్ హాలులో జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న రహదారులపై ఎన్ ఫోర్స్ మెంట్ చర్యలను కఠినతరం చేయాలని, ప్రధాన రహదారుల్లో డివైడర్లను బ్రేక్ చేసి […]

మహిళలసాధికారత కోసమే మిషన్‌ శక్తి

మహిళల భద్రత, సాధికారతకు కేంద్ర ప్రభుత్వం మిషన్ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో మిషన్ శక్తి కార్యక్రమం అమలుపై జిల్లా స్థాయి మిషన్ శక్తి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ శక్తిలో ‘సంబల్’ మరియు ‘సమర్థ్య’ ఉప పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు వెల్లడించారు. “సంబల్” పథకం మహిళల భద్రతకు, “సమర్థ్య” పథకం మహిళల సాధికారత కోసం ఏర్పాటు చేసిందన్నారు. […]

మైదుకూరు నియోజవర్గ ప్రింట్ మీడియా విలేకరుల సంఘ అధ్యక్షునిగా జి. శ్రీనివాసులు( వాసు) ఏకగ్రీవ ఎన్నిక

       మైదుకూరు నియోజకవర్గ ప్రింట్ మీడియా సమావేశం బుధవారం మైదుకూరులోని ఏ వన్ ఫంక్షన్ హాల్ లో ఘనoగా నిర్వహించారు. సమావేశానికి మైదుకూరు నియోజకవర్గం లోని దువ్వూరు ,చాపాడు,  ఖాజీపేట, బ్రహ్మంగారిమఠం, మైదుకూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రింట్ మీడియా విలేకరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.              గౌరవ అధ్యక్షులుగా యాపరాల వెంకటసుబ్బయ్య ( సాయంకాలం), మైదుకూరు నియోజకవర్గం ప్రింట్ మీడియా […]

ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేయండి

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో  ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ విప్, జమ్మలమడుగు శాసన సభ్యులు సి.ఆదినారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆగస్టు 1న ముఖ్యమంత్రి జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువు గ్రామంలో పెన్షన్ లబ్ధిదారులకు […]