రెవెన్యూ డివిజన్ల వారీగా మండలాలు

వైయస్సార్ కడపజిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు అయ్యాయి. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఉన్న హయాంలో రెండు డివిజన్లను నాలుగు రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారు. [table id=1 /]
200లోపు యూనిట్లు ఉంటేనే ఉచిత విద్యుత్తు

రాష్ట్ర ప్రభుత్వం SC, ST విద్యుత్ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందాలంటే విధిగా ప్రతి నెలా 200 యూనిట్ల లోపు వినియోగం ఉంటేనే వర్తిస్తుందని వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు సబ్ డివిజన్ అధికారి శ్రీకాంత్ తెలిపారు. ఈవిషయాన్ని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు గమనించాలని సూచించారు. 200 యూనిట్లు మించితే ఉచిత విద్యుత్తు వర్తించదని, మొత్తం బిల్లును వినియోగదారుడే భరించాలని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ పథకంపై అవగాహన కల్పిస్తున్నా ఎక్కువ శాతం SC, […]
గడియారం వేంకట శేష శాస్త్రి

శతాబ్ధపు మహాకవులలో గడియారం వేంకట శేష శాస్త్రి గారు ఒకరు. శాస్ర్రి గారి శివభారతం మహాకావ్యం మూలంగా చిరస్థాయిగా ప్రజల మనస్సుల్లో చోటు చేసుకోగలదంటూ ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్య తన సంతాపంలో పేర్కొన్నారు. ఈయన కాలిగోటికి కూడా మేము సరిపోము. ఈయన శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని శాస్ర్రి గారి వర్ధంతి సభలో మన పుట్టపర్తి నారాయణాచార్యులు కోరారు. ఎందరో మహానుభావుల్లో అందులో ఒకరైన గడియారం వేంకట శేష శాస్ర్రి మన జిల్లా వాసి అయినందుకు సంతోషించాలి. […]
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం

క్రీస్తు శకం 1356 లో అప్పటి విజయనగర చక్రవర్తి సంగమ బుక్క రాయలు ఒంటిమిట్టలో కోదండ రామాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అప్పటికి గర్భాలయం అంతరాలయం మాత్రమే ఉండేవి. ఆలయంపైన చిన్న విమాన గోపురం ఉండేది. ఆ తరువాత ఆలయానికి రెండు మూడు దశల్లో నిర్మాణాలు జరిగాయి. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన శిలలను పరిశీలిస్తే ఈ సంగతి తెలుస్తుంది. అంతరాళ భవనం తరువాత […]
జొన్నవరం వద్ద ఎత్తిపోతల పథకానికి రూ.780కోట్లు మంజూరు

వైఎస్సార్ కాంగ్రెస్ నిర్లక్షం చేసినా వైఎస్సార్ కడపజిల్లా దువ్వూరు మండలం జొన్నవరం వద్ద కుందూనది పై ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. రూ.780కోట్లు నిధుల విడుదలకు అంగీకారం తెలిపింది. త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడనున్నట్లు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. ఎగువన వర్షాలు అనుకూలించక కృష్ణానది పరుగులు తీయక పోయినా కర్నూలు, నంద్యాల జిల్లాలో కురిసే వర్షాలతో కుందూనదిలోకి చేరే నీటిని ఒడిసిపట్టి తెలుగుగంగ కాలువలోకి ఎత్తిపోసేలా ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు […]
రంగురంగుల లకుముకి పిట్టలు

సాగునీటి పారుదల కలిగిన కేసీకాలువ ఆయకట్టు ప్రాంతంలో లకుముకి పిట్టలు (కింగ్ ఫిషర్) కనిపిస్తున్నాయి. చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్నాయి. చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
పుష్పగిరి కొండపై కాకతీయుల కాలం నాటి ఆలయం

వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు మండలంలోని పుష్పగిరి క్షేత్రం వద్ద కాకతీయుల కాలం నాటి పుష్పాచలేశ్వర ఆలయం ఉంది. దుర్గాదేవి ఆలయానికి ఈశాన్యంలో కొండపై వందల ఏళ్ల కిందట నిర్మించిన ఆలయం ఉన్నట్లు రచయిత, చరిత్రకారుడు తవ్వా ఓబులరెడ్డి తెలిపారు. నడిగట్టు ఆలయంగా పూర్వం పూజలు చేసేవారు. కాకతీయుల వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించిన ఆలయం హరిహర క్షేత్రంగా వెలుగొందింది. ఆలయంలో ఉమామహేశ్వరుడు, లక్ష్మీనారాయణ స్వామి, సుబ్రహ్మణ్యుడు, విఘ్నేశ్వరుడి విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు మెకంజీ అధ్యయనం చెబుతోంది. 12వ […]
సుంకేశుల నుంచి కృష్ణాపురం వరకు

కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాలో కేసీకాలువ ఆయకట్టు కింద కర్నూలు, నంద్యాల జిల్లాలో 173627ఎకరాలు, కడప జిల్లాలో 92,001 ఎకరాలకు సాగునీరు అందాలి. అయితే కాలువకు సాగునీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహించాలో తెలుసుకుందాం. సుంకేశుల ఆనకట్ట నుంచి లాకెన్సుల వరకు (0.000కి.మీ నుంచి 120.19కి.మీ) 120.19కి.మీ లాకెన్సుల నుంచి సంతజూటూరు వరకు (120.19కి.మీ నుంచి 150.65కి.మీ) 30.46కి.మీ సంతజూటూరు ఆనకట్ట నుంచి రాజోలి ఆనకట్ట వరకు (150.65కి.మీ నుంచి 234.64కి.మీ) 83.99కి.మీ రాజోలి […]
బాపూజీ సిద్ధాంతాలతో ప్రభావితం

వందేమాతరం అంటూ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా నడిచిన నాయకుల్లో బ్రహ్మంగారిమఠం ఓబులరాజుపల్లె గ్రామానికి చెందిన బొమ్ము రామారెడ్డి ఒకరు. జననం : 1914 మరణం : 1985 జనవరి 1 గ్రామం : ఓబులరాజుపల్లె, మండలం : బి.మఠం, తల్లి : సుబ్బమ్మ, తండ్రి : పెద్దవీరారెడ్డి, విద్య : స్వగ్రామంలో ప్రాధమిక విద్య, బద్వేలు చియ్యపాడులో ఉన్నత విద్య, ప్రొద్దుటూరులో ఎస్ఎస్ఎల్‌సీ, మద్రాసు లయోలా కళాశాలలో పైచదువలు, సహచర విద్యార్థులు : నీలం సంజీవరెడ్డి, కాసు […]
కాకతీయుల గణపతిదేవుని కాలంనాటి విగ్రహం

ఓరుగల్లు రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాకతీయ గణపతిదేవుని కాలంనాటి శిలా విగ్రహం (వీరగల్లు) ఒకటి దువ్వూరు మండలం రాంసాయినగర్ సమీపంలో గుర్తించారు. రాంసాయినగర్ దక్షిణ దిశలో మూడిండ్లపల్లె గ్రామానికి చెందిన మంచాల సుబ్బిరెడ్డి పొలంలో విగ్రహం బయటపడిన విషయం తెలుసుకున్న పురావస్తు శాస్త్రవేత్త శేగినేని వెంకట శ్రీనివాసులు ఆయన శిష్యుడు రంగస్వామిలు పరిశీలించారు. శేగినేని వెంకట శ్రీనివాసులు భాస్కర్ పీడియాతో మాట్లాడుతూ గణపతిదేవుని కుమార్తె రాణిరుద్రమదేవి యుద్ధ విజేతగా అశ్వంపై వెళ్తున్నట్లుగా ఉందని, వాటివెనుకే రాజలాంఛనం వరాహం, […]