Skip to main content

Baskar Pedia

ఎస్.పి.నాగిరెడ్డి

శెట్టిపల్లె పెద్ద నాగిరెడ్డి. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పెదనాన్న. చాపాడు మండలం నక్కలదిన్నె గ్రామానికి చెందిన పెద్దనాగిరెడ్డి 18వ ఏటనే అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడిగా చేరి ప్రొద్దుటూరు తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర, జిల్లా సభ్యుడిగా ప్రొద్దుటూరు పరిధిలోని ఓబాయపల్లి పంచాయతీ బోర్డు అధ్యక్షుడుగా మూడుసార్లు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. 1959లో మైదుకూరు పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1967 ఫిబ్రవరి నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో  మైదుకూరు నియోజకవర్గం నుంచి […]

ప్రపంచ వారసత్వ నీటి పారుదల కట్టడంగా కేసీకాలువ

ప్రపంచ చారిత్రక నీటిపారుదల కట్టడంగా అతి పురాతనమైన కర్నూలు-కడప కాలువ (కేసీకాలువ) గుర్తింపు పొందింది.  ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ సంస్థ న్యాయ నిర్ణేతల బృందం పరిశీలించి ఎంపిక చేసింది. 2024లో దేశంలోని నాలుగు ప్రాజెక్టులను ఎంపిక చేయగా అందులో కేసీకాలువ ఒకటి.  ** ఇది కేసీకాలువ చరిత్ర భారీ నీటిపారుద‌ల ప్రాజెక్టుల్లో కేసీకాల్వ ఒక‌టి. క‌ర్నూలు జిల్లాలో 1,73,627ఎక‌రాల‌కు, క‌డ‌ప జిల్లాలో 92,001ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు నీరందించే ప్రధాన‌ నీటి వ‌న‌రు. అతి పురాత‌న‌మైన […]

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా రెడ్యం

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా రెడ్యం వెంకట సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ అధిష్టానవర్గం ప్రకటించింది. రెడ్యంకు పార్టీలో కీలక పదవి లభించడంతో ఆయన అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆయన అభిమానులు ఖాజీపేట కూడలి చేరుకుని మహాత్మాగాంధి, పొట్టిశ్రీరాములు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాణాసంచా పేల్చారు. మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.

విదేశీ పక్షులు..గాంధీనగర్ అతిథులు

ఎర్రకాళ్లు.. నల్లరంగు ఈకలతో రెక్కలు…ఊదారంగు ముక్కుతో ఉన్న పక్షులు వైఎస్సార్ కడప జిల్లా చాపాడు మండలం గాంధీనగర్ గ్రామానికి తరలివచ్చాయి. సంతానోత్పత్తి కోసం వేల కి.మీ ప్రయాణించి చేరుకున్న విదేశీ పక్షులు ఏటా జూన్ నెలలో చేరుకుంటాయి. సంతానంతో డిసెంబరు ఆఖరునాటికి తిరిగి వెళ్లిపోనున్నాయి. ఒకవైపు కుందూనది మరోవైపు పెన్నానది ఇంకోవైపు పాపాఘ్ని నదులు ఆహార వేటకు అనుకూలంగా ఉండటంతో గాంధీనగర్ గ్రామానికి ఏటా పక్షులు తరలి వస్తున్నాయి. గ్రామానికి చేరుకున్న పక్షులను వేటగాళ్ల బారిన పడకుండా […]

జొన్నవరం వద్ద ఎత్తిపోతలకు రూ.780కోట్లు మంజూరు

వైఎస్సార్ కాంగ్రెస్ నిర్లక్షం చేసినా వైఎస్సార్ కడపజిల్లా దువ్వూరు మండలం జొన్నవరం వద్ద కుందూనది పై ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. రూ.780కోట్లు నిధుల విడుదలకు అంగీకారం తెలిపింది.  త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు.   ఎగువన వర్షాలు అనుకూలించక కృష్ణానది పరుగులు తీయక పోయినా కర్నూలు, నంద్యాల జిల్లాలో కురిసే వర్షాలతో కుందూనదిలోకి చేరే నీటిని ఒడిసిపట్టి తెలుగుగంగ కాలువలోకి ఎత్తిపోసేలా ఎత్తిపోతల పథకం […]

ఆ ఊరి నేస్తాలు గబ్బిలాలు

చెట్ల కొమ్మలను అంటిపెట్టుకుని తలకిందులుతూ వేలాడుతూ కనిపించే గబ్బిలాలు వైఎస్సార్ కడప జిల్లా డయాంఖానపల్లెలో రామాలయం వద్ద కనిపిస్తున్నాయి. వందలాది పక్షులు దశాబ్దాలుగా గ్రామాన్ని అంటి పెట్టుకుని ఉన్నాయి. చీకటి పడగానే ఆహారం కోొసం వెళ్లిపోయే ఈ గబ్బిలాలు అర్ధరాత్రి వరకు తిరిగి చెట్టు వద్దకు చేరుకుని కనిపిస్తాయి. గబ్బిలాలను గ్రామస్తులు దేవతా పక్షులుగా భావించి వేటగాళ్ల బారి నుంచి కాపాడుతున్నారు. గ్రామస్తులు వీటిని గవాజీ పక్షులుగా కొన్నిచోట్ల చీకిరేవులుగా పిలుస్తూ ఉంటారు.

ఆదిమానవుని స్థావరం

అలనాటి కట్టడాలు.. నిర్మించిన కోనేరులు…  శిల్ప సంపద.  ఇవన్నీ ప్రాచీన చరిత్రకు సాక్ష్యాలుగా చెప్పవచ్చు. దువ్వూరు మండలం పెద్దభాకరాపురం సమీపంలో గణాద్రిస్వామి గుట్టగా పిలవబడే గుట్టలపై ఆది మానవుడు సంచరించాడని చెప్పడానికి అక్కడ కనిపించే శిలా చిత్ర లేఖనాలు సాక్షాలుగా  నిలుస్తున్నాయి. కొండపై మానవుని పాదాలు, ఎడ్లు, నంది పాదం, ఆయుధం, వ్యవసాయ పనిముట్లు, జంతువులు ఇలా పలు శిల్పిన చిత్ర లేఖనాలు గణాద్రిస్వామి గుట్టపై కనిపిస్తున్నాయి.  సంరక్షణ దిశగా చర్యలు కరవయ్యాయి.  స్థానికులు గుట్టపై రాళ్ల […]