Skip to main content

Baskar Pedia

ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాల పుస్తక ఆవిష్కరణ

మైసూరు దసరా ఉత్సవాల తరువాత దక్షిణ భారతదేశంలో అత్యంత వైభవంగా ఘనంగా దసరా ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో  ప్రొద్దుటూరు అగ్రస్థానంలో నిలుస్తుంది. ఎప్పటిలాగానే ఈయేడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ముద్రించిన ప్రత్యేక పుస్తకాలను ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామమోహన్ కమిటి సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. దసరా ఉత్సవాల విశిష్టత, ఆధ్యాత్మికత, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రజలకు చేరువ చేసేలా పుస్తకాలను రూపొందించారు.