నారు నాగసూర్య

తెలుగు సాహితీ లోకంలో విశేష కృషి చేసిన వారిలో నారు నాగసూర్య ఒకరు. బ్రాహ్మణేతర కవుల్లో అగ్రగామిగా నిలిచారు. ఉత్తమ సాహితీవేత్తగా ప్రశంసలు అందుకున్నారు. పెద్దన మనుచరిత్రను, ముక్కు తిమ్మన పారిజాతాపహరణాన్ని అచ్చతెలుగులో అనువదించారు.వీరపూజ, శ్రీ పృథ్వీరాజవిజయము, తిలోత్తమాసాహసికము, శకుంతల, ఊర్వశి, వెన్నెల పెళ్ళి, రామకత, ఉషారాజ్ఞి, ధ్యానమాలిని, ప్రణయిని, శ్రీ రమణాభ్యుదయము, ఆర్యవాణి, తెలుగుతల్లి శతకము, సౌందర్యలహరి, శ్రీ మలయాళ సద్గురు దండకం, శ్రీ రమణానుగ్రహ స్తుతి, కేనోపనిషత్తు, యతిగీతం, శ్రీ హృదయాభ్యుదయము, శ్రీరామహృదయం, లక్ష్మణహృదయం, […]