ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నరసింగోలులో మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేశారు. ఈసందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ గతంలో దామచర్ల ఆంజనేయులు ఈ ప్రాంతానికి మంచి సేవలు అందించిన నాయకుడని ప్రస్తుతం మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి లాంటి నేతలు ప్రజల గురించి నిరంతరం ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులు నాగలి పట్టుకుని పొలానికి వెళ్లాలే కానీ అర్జీలు పట్టుకుని అధికారులు చుట్టూ తిరగడానికి కాదన్నారు. భూమి మీదే, దానిపై హక్కూ మీదే, భూ వివాదాలు లేకుండా పట్టాల పంపిణీ చేసేలా రీసర్వే ప్రక్రియను పూర్తి చేస్తున్నామని తెలిపారు. పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్ ను రూ.166 కోట్లతో రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రిజర్వాయర్ పూర్తి చేసి 9500 ఎకరాలకు సాగునీరు, 15 గ్రామాల్లో 35 వేల మందికి తాగునీరు అందుతుందన్నారు. గత పాలనలో భూములకు భద్రత లేదు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా భయంతోనే బ్రతకాల్సిన పరిస్థితి ఉండేదని, ఎప్పుడూ లేనన్ని సమస్యలు సృష్టించి వెళ్లారని, అన్ని వ్యవస్థల్లోనూ అగాధాలు సృష్టించారని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ తో ఆ సమస్యల్ని పరిష్కరించి అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నామని, గత పాలకులు ఆక్రమణలు, దందాలు, భూవివాదాలు సృష్టించి రెవెన్యూ వ్యవస్థను సర్వనాశనం చేశారన్నారు. ఆస్తి మీది కానీ వాటిపై ఎవరో బొమ్మలు వేసుకున్నారని, సర్వే రాళ్లపై ఫోటోలు వేసుకున్నారని అలాంటి వాళ్లు మీపై రాజకీయం చేశారని, ప్రజల ఆస్తుల్ని సర్వనాశనం చేశారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరుతో భూములకు వివాదాలు సృష్టించడంతోనే నల్ల చట్టాన్ని రద్దు చేశామన్నారు. రెవెన్యూ సంస్కరణల్ని పరిష్కరిస్తూ రాజముద్రతో అత్యంత కట్టుదిట్టమైన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామన్నారు. పాస్ పుస్తకాల పంపిణీని స్వయంగా పర్యవేక్షించేందుకే ప్రతీ నెలా ప్రజల ముందుకు వస్తున్నానన్నారు. ఈ యజ్ఞం సక్రమంగా పూర్తి అయ్యేంత వరకూ రైతుల ముందుకు వస్తూనే ఉంటానన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని, ప్రజల కోసం అందరి దగ్గరకూ వెళ్తానన్నారు. దిల్లీలో ప్రధాని మోదీ సహా మంత్రులను కలిసి రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులు ఇవ్వాలని కోరినట్లు వివరించారు. ఇప్పటి వరకూ 40.58 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని, ఒక అక్టోబరులోనే 790 గ్రామాల్లో 4 లక్షల పైచిలుకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.ఇంకా రాష్ట్రంలో 51 లక్షల పాస్ పుస్తకాలను నెల వారీగా లక్ష్యం విధించుకుని వాటిని పంపిణీ చేస్తామన్నారు. చిట్టచివరి వ్యక్తి వరకూ పూర్తి పారదర్శకతతో కట్టుదిట్టమైన రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. గత పాలనలో వ్యతిరేకంగా ఉన్న వారి భూముల్ని 22ఏ జాబితాలో పెట్టారని, 16.48 లక్షల ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించామనానరు. కంగుంది, అమలాపురం, శెట్టిపల్లి సహా వివాదాల్లో ఉన్న 41 వేల ఎకరాలకు విముక్తి కల్పించామన్నారు. ప్రకాశం జిల్లాలో 4 మండలాల్లోని 2,915 ఎకరాల గర్భ కండ్రిక భూమి సమస్యలకు కూడా విముక్తి కల్పిస్తున్నామని తెలిపారు. వివిధ కేటగిరీల్లో ఉన్న భూములన్నింటినీ డిజిటలైజ్ చేశామని, రైతులకు, భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా ఈ చర్యలు తీసుకున్నామన్నారు.
మీభూమి మీహక్కు
Share this article
More News

మీభూమి మీహక్కు
October 9, 2026

సీఎంను ఆహ్వానించిన అమీన్ పీర్ దర్గా ప్రతినిధులు
October 6, 2026

అమరజీవి జలధార రూ.30,156 కోట్లతో ఇంటింటికీ తాగునీరు
October 5, 2026

ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాల పుస్తక ఆవిష్కరణ
October 1, 2026

సీఎం ను ఆహ్వానించిన దుర్గ మల్లేశ్వర స్వామి ధర్మకర్తల మండలి
September 30, 2026

తిరుమలలో అక్టోబరు 12వతేది నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
September 28, 2026

రాయలసీమ ఉద్యాన హబ్ రీల్, వీడియో పోటీ
September 28, 2026

87ఎర్రచందనం దుంగలు స్వాధీనం
September 23, 2026