తిరుమలలో అక్టోబరు 12వతేది నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12వతేది నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం వాహనసేవ 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు, గరుడవాహనసేవ రాత్రి 6.30 నుంచి 11.30 గంటల వరకు జరుగనుంది. వాహన సేవల వివరాలు : అక్టోబరు 11 : అంకురార్పణం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు అక్టోబరు 12 : బంగారు తిరుచ్చి […]
రాయలసీమ ఉద్యాన హబ్ రీల్, వీడియో పోటీ

రాయలసీమ, ప్రకాశం మరియు మార్కాపురం ప్రాంతాలను భారతదేశంలోనే అత్యంత కీలకమైన గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా (ప్రపంచ ఉద్యాన కేంద్రం) అభివృద్ధికి ఉద్దేశించిన బృహత్తర ప్రాజెక్టును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం రీల్, వీడియో పోటీ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి, సాగునీటి మౌలిక వసతుల కల్పన, తోటబడుల విస్తరణ, రైతుల సాధికారతను ప్రతిబింబించేలా క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, విద్యార్థులు మరియు డిజిటల్ క్రియేటర్లు తమ […]
87ఎర్రచందనం దుంగలు స్వాధీనం

వైఎస్సార్ కడప జిల్లాలో మూడు వేర్వేరు ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న తొమ్మిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి నుంచి 87 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగించిన 5వాహనాలు సీజ్ చేశారు. మన్నూరు పరిధిలో 42, వీరబల్లి పరిధిలో 8, ఖాజీపేట పరిధిలో 37ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం వృక్షాలను నరికినా, దాచినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా, అక్రమాలకు సహకరించినా కఠిన చర్యలు […]
రూ.11,360 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పనకు రూ.11,359 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. 123 మున్సిపాలిటీల్లో రూ.7469 కోట్ల పనులు, గ్రేటర్ విశాఖ పరిధిలో రూ.3,890 కోట్ల విలువైన పనులు చేయనున్నారు. హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఎంఏ) విధానంలో కూటమి ప్రభుత్వం తొలిసారి పనులు చేపడుతోంది.
వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభోత్సవ చిత్రాలు

వెలిగొండ ప్రాజెక్టుకు 1996 మార్చి 5న చంద్రబాబునాయుడు, 2004 అక్టోబరు 27న మరోసారి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మూడు దశాబ్దాల తరువాత 2026 ఆగస్టు 31న వెలిగొండ మొదటి ఫేజ్ ను చంద్రబాబునాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
ప్రధానమంత్రి నోట.. కడప జిల్లా రైతు విజయగాధ

టమోటా, అరటి పంటల స్థానంలో అవకాడో పంట సాగు చేసి మంచి ఫలితాలను సాధిస్తున్న వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్లకు చెందిన రైతు కర్ణ వరదారెడ్డిని ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రశంసించారు. 2026 ఆగస్టు 30న నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో రైతు కృషిని కొనియాడారు. ప్రధానమంత్రి మాటల్లోనే… ఈ రోజుల్లో అవోకాడో పండుకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఒకప్పుడు దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవడమే కాకుండా, దీనికి డిమాండ్ కూడా చాలా […]
గండికోటకు కృష్ణాజలాల చేరిక

నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయరు నుంచి వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట జలాశయానికి కృష్ణా జలాలు చేరుతున్నాయి. 2026 ఆగస్టు 30వతేది రాత్రి నీటి చేరిక ప్రారంభమైంది. అవుకు జలాశయం నుంచి 57కి.మీ జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా ప్రవహించి గండికోట సొరంగం ద్వారా గండికోట ప్రాజెక్టులోకి 3300క్యూసెక్కులు నీరు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. 26.850టీఎంసీలు సామర్థ్యం కలిగిన జలాశయంలో ప్రస్తుతం 12.686టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి 21.744టీఎంసీలు ఉండేవి.
ఒంగోలు గిత్త విగ్రహం ఆవిష్కరణ

అత్యంత ప్రసిద్ధి చెందిన పశు జాతుల్లో ఒంగోలు జాతి పశువులు ఒకటి. తెల్లని దేహం.. బలమైన కండరాలు… విశాలమైన ఛాతీ… ధృడమైన కొమ్ములు. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునే అపురూపమైన దేశీ పశుజాతి ఒంగోలు జాతి రకం పశువులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక గుర్తింపును చాటి చెప్పేలా ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రి వద్ద ఒంగోలు గిత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2026 ఆగస్టు 28న మంత్రి నారాలోకేష్ ఆవిష్కరించారు. ఒంగోలు గిత్త విశిష్టతను భావితరాలకు పరిచయం చేయడంతోపాటు ప్రకాశం […]
ఆచార్య అప్పాజోశ్యుల సత్యనారాయణకు గడియారం సాహిత్య పురస్కారం

బాపట్ల జిల్లా చీరాలకు చెందిన ప్రముఖకవి, ప్రసిద్ధ కంప్యూటర్ శాస్త్రవేత్త ఆచార్య అప్పాజోశ్యుల సత్యనారాయణ మహాకవి డాక్టర్ గడియారం వేంకట శేషశాస్త్రి 45వ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఈవిషయాన్ని రచన సాహిత్య వేదిక కార్యదర్శి భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి పేర్కొన్నారు. రచన సాహిత్య వేదిక, గడియారం కుటుంబీకుల సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబరులో ప్రొద్దుటూరులో నిర్వహించే ప్రధాన సభలో పురస్కారం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆచార్య అప్పాజోశ్యుల సత్యనారాయణ రచించిన ‘పంచవటి’ (పంచభూత తారావళులు) అనే పద్యకృతి ఎంపికైనట్లు వివరించారు. […]
ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు

ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా శనగ కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు జిలా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. పీజిఆర్ఎస్ హాల్ లో ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు పై జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 80,103 హెక్టార్లలో శనగ పంట సాగైనట్లు తెలిపారు. దళారుల చేతుల్లో మోసపోకుండా కనీస మద్దతు ధరతో మార్క్ ఫెడ్ కొనుగోలు చేస్తుందని తెలిపారు. * కొనుగోలు […]