అవును గండికోట కాదు హుండికోట

మనం పిలుస్తున్న గండికోటకు పూర్వ పేరు హుండికోట అని మీకు తెలుసా? అవును ఇది నిజమే. గండికోట ఉత్సవాల సందర్భంగా కడప జిల్లా ఇంటాక్ చాప్టర్ కన్వీనర్ చిన్నపరెడ్డి పర్యవేక్షణలో ఇంటాక్ సభ్యులు, విద్యార్థులతో కలిసి హెరిటేజ్ వాక్ చేస్తున్న సమయంలో ఈ శాసనం వెలుగు చూసింది. గండికోట మాధవరాయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన శాసనమని, ముస్లిం పాలకులు గండికోట దుర్గాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మాధవరాయ స్వామి ఆలయాన్ని శిథిలం చేసి ఆలయ […]
నేటి యువతరానికి ఆదర్శం వడ్డే ఓబన్న

తన ప్రజల స్వేచ్చా జీవనాన్ని కోరుతూ.. బ్రిటిష్ పాలనను అంతమొందించేందుకు తన ప్రాణాలను త్యాగం చేసిన దేశభభక్తుడు, తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న అని.. నేటి యువతరానికి ఆయన ఆదర్శమని డీ ఆర్వో విశ్వేశ్వర నాయుడు అన్నారు. ఆదివారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధులు వడ్డే ఓబన్న 219వ జయంతి నిర్వహించారు. డీఆర్వో విశ్వేశ్వర నాయుడు మాట్లాడుతూ వడ్డే ఓబన్న 11 జనవరి 1807న నంద్యాల జిల్లా, […]
శ్రీరామ మహా శోభాయాత్ర విజయవంతం చేయండి

విశ్వహిందూ పరిషత్, కడప అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో కడపలో నిర్వహిస్తున్న సీతారామ కళ్యాణం, శ్రీరామ మహా శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ శాఖల అధికారులను ఆదేశించారు. ఈనెల 21న సీతారాముల కల్యాణోత్సవం, 22న శ్రీరామ మహా శోభాయాత్ర నిర్వహణ, శాంతి భద్రతలపై కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి, అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాయలసీమలోనే అంతంత ప్రతిష్టాత్మకంగా 22న నిర్వహించే శ్రీరామ […]
రైతు పక్షపాత ప్రభుత్వం

తెదేపా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతులకు అండగా ఉంటుందని జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ఎస్.సవిత తెలిపారు. కమలాపురం నియోజక వర్గం వీరపు నాయుని పల్లె లో ఉల్లి రైతులకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆర్థిక ఇబ్బందులల్లో ఉన్నా ఉల్లి రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిహారం మంజూరు చేసి అండగా నిలిచారన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా 7,298 మందికి […]
గండికోట ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్ పరిశీలన

ఈనెల 11వతేది నుంచి మూడురోజులపాటు పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే గండికోట ఉత్సవాల నిర్వహణకు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. జమ్మలమడుగు నియోజకవర్గం గండికోటలో గండికోట ఉత్సవాల నిర్వహణ, సాస్కి పర్యాటక అభివృద్ధి పనులు, సభా వేదిక, స్టాల్స్ ఏర్పాటు, పార్కింగ్ వంటి అంశాలపై పరిశీలించారు. గండి కోట ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు తయారు చేసిన కార్యాచరణ ప్రణాళిక మేరకు దిశా నిర్దేశం చేశారు. గండికోట […]
వైఎస్సార్ కడప జిల్లా కొత్త మ్యాపు

జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వైెఎస్సార్ కడప జిల్లా నూతన మ్యాపును జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, రాజంపేట ఏఎస్పీ మనోహర్ కుమార్ హెగ్డే లతో కలిసి ఆవిష్కరించారు. .
అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా వైయస్సార్ కడప జిల్లా

వైఎస్సార్ కడప జిల్లాలో రాజంపేట నియోజకవర్గం కలవడంతో అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా వైయస్సార్ కడప జిల్లా నిలిచిందని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం లోని రాజంపేట, నందలూరు, వీరబల్లె, సుండుపల్లె మండలాలు జిల్లాలో విలీనమైనట్లు తెలిపారు. ప్రస్తుతం 40 మండలాలతో రాష్ట్రంలోనే అత్యధిక మండలాలు గల జిల్లాగా నిలిచిందని అన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ […]
రాజంపేట డివిజన్ అధికారులతో చర్చించిన కలెక్టరు

జిల్లాల పునర్విభజన తరువాత మొదటిసారి రాజంపేట నియోజకవర్గ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో దర్శనం, ప్రత్యేక అర్చనలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయ పరిశీలనకు వచ్చిన కలెక్టరు రాజంపేట సబ్ కలెక్టర్ భావన పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. సమావేశ మందిరంలో రాజంపేట రెవిన్యూ డివిజన్ పరిధిలోని మండల తహసీల్దార్లతో సమావేశమయ్యారు. రెవెన్యూ డివిజన్ […]
బ్రహ్మంగారి ఆలయ అభివృద్ధికి డీపీఆర్ సిద్ధం

ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ధీటుగా జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లెలోని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్ధేలా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత నిధులతో బ్రహ్మంగారిమఠంను సర్వాంగ సుందరంగా రూపుదిద్దేలా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన డీపీఆర్ ను సిద్ధం చేయించారు. రూ.136.63కోట్లతో ప్రణాళికను రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీం కింద నిధుల మంజూరుకు ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారు. తనను గెలిపించిన ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే తపనతో ఎమ్మెల్యే ఉన్నారు.
నీటి భద్రత తోనే దేశ భవిష్యత్తు

నీటి భద్రతతోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. నీటి భద్రత, సంరక్షణ, నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దిల్లీలో ఐఐటీ, నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహించిన ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ లో జిల్లా రివర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ ఫ్రేమ్‌వర్క్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నీటి నిర్వహణ పై ప్యానలిస్ట్ గా జిల్లా కలెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. జిల్లాలో దీర్ఘకాలిక నీటి భద్రతకు నాలుగు పద్ధతులను వివరించారు. […]