అభివృద్ధి ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలి

జిల్లాలో అన్ని శాఖలకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ జిల్లాలోని శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీ నాటికి జిల్లాలో అన్ని రంగాల్లో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిపై ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలన్నారు. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు, మాధకద్రవ్యాల నిరోధం, గ్రామవార్డు సచివాలయాల్లో సేవల మెరుగు వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. […]
జిల్లాలో యధావిధిగా విమానయాన సేవలు

జిల్లాలో ఎప్పటిలాగే యథావిధిగా విమానయాన సేవలు కొనసాగిస్తున్నామని, భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందిస్తామని కడప ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సుజిత్ కుమార్ పోద్దార్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం కడప విమానాశ్రయంలో ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఇండిగో విమాన సేవల సంక్షోభం తరువాత భవిష్యత్తులో కడప విమానాశ్రయం అందించే సేవలను వివరించారు. 2025 డిసెంబర్ మొదటి వారంలో జరిగిన ఇండిగో (IndiGo) సంక్షోభం తరువాత ప్రస్తుతం కడప విమానాశ్రయం నుంచి అన్ని విమానాలు నిర్ణీత సమయానికి నడుస్తున్నాయి. […]
ఈశ్వరీ మహాదేవి ఆరాధన గురు పూజ మహోత్సవం

వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లెలో ఈ నెల 11వ తేది నుంచి ఈశ్వరీ మహాదేవి ఆరాధన గురు పూజ మహోత్సవం నిర్వహించనున్నారు. 11న పంచామృతాభిషేకం, కుంకుమార్చన పూజలు, రాత్రి కలశోత్సవం, కలశ స్థాపన ఉత్సవం, 12న పంచామృత అభిషేకం, కుంకుమార్చన పూజలు, అశ్వవాహన ఉత్సవం, రాత్రి హంస వాహన ఉత్సవం, 13న ఈశ్వరీ మహాదేవి సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం సందర్భంగా పంచామృతాభిషేకం, కుంకుమార్చన పూజలు, దీక్షా అలంకరణ ఉత్సవం, సింహ […]
గండికోట పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

సాస్కి పథకంతో గండికోట పర్యాటక కేంద్రానికి ప్రపంచ స్థాయిలో కీర్తిని ప్రతిబింబించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో గండికోట పర్యాటక అభివృద్ధి పనులపై డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, జిల్లా పర్యాటక శాఖ, ఏపీటీడీసీ అధికారులు, కాంట్రాక్టు ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గండికోట ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి […]
జిల్లావాసులకు త్వరలో అధునాతన విమానయాన సేవలు

జిల్లా ప్రజలకు త్వరలో అధునాతన విమానయాన సర్వీసులు చేరువ కానున్నట్లు కడప పార్లమెంట్ సభ్యులు వై.ఎస్.అవినాష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ఎయిర్ పోర్టు నూతన టర్మినల్ బిల్డింగ్ కు నూతన రహదారుల ఏర్పాటు, అధునాతన స్నాక్ బార్ & ఫుడ్ ఫెసిలిటీ, ఎయిర్ పోర్ట్ […]
జనవరిలో గండికోట ఉత్సవాలు

వచ్చే ఏడాది జనవరిలో గండికోట ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మొదటి నాలుగు రోజులు ప్రమోషనల్ ఈవెంట్స్, మిగతా మూడు రోజులు ముఖ్యమైన ఈవెంట్స్ నిర్వహించాలని సూచించారు. ముఖ్యమైన ఈవెంట్లలో భాగంగా నిర్వహించే ప్రదర్శనల్లో జాతీయ స్థాయిలో పేరు పొందిన మ్యూజిక్, డాన్స్ బృందాలను ఆహ్వానించాలని పేర్కొన్నారు. గండికోట ఉత్సవాల్లో స్వయం సహాయక గ్రూపు సంఘాలతో జిల్లా స్ట్రీట్ ఫుడ్, ఎగ్జిబిషన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. గండికోట […]
సామాజిక రుగ్మతలను తొలగించడమే లక్ష్యం

జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పారదర్శకంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సంయుక్తంగా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. జేసీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసులలో […]
జీవీసత్రం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా

కడప జిల్లా మైదుకూరు మండలం జీవీసత్రం సమీపంలో 67వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం ఆర్టీసీ కడప డిపోకు చెందిన బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. విజయవాడ నుంచి కడపకు వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు మార్గమధ్యంలోని జీవీసత్రం వద్ద బైపాస్ పైకి చేరుకుంది. జీవీసత్రంలో దిగాల్సిన ప్రయాణికులు ఉండటంతో బైపాస్ నుంచి జీవీసత్రం వైపు బస్సును మళ్లించారు. దాదాపు 2 అడుగుల ఎత్తు నుంచి బస్సు జీవీసత్రం దారిలోకి మళ్లే సమయంలో అదుపుతప్పి […]
ఉల్లి రైతులకు నష్టం వాటిల్లకుండా మార్కెటింగ్

ఉల్లి రైతులకు నష్టం వాటిల్లకుండా మార్కెటింగ్ చేపట్టేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జేసీ అదితి సింగ్ తో కలిసి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి పంట కొనుగోలుకు సంబంధించి జిల్లాలోని ఉల్లి ట్రేడర్లతో సమావేశం ఏర్పాటు చేసి, ఉల్లి కొనుగోలుపై సలహాలు సూచనలు ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న రైతుల నుంచి అధిక లాభాలను ఆశించరాదని ట్రేడర్లకు సూచించారు. నష్టాల బాటలో […]
జిల్లా కలెక్టరును కలిసిన ఎస్పీ

జిల్లా ఎస్పీగా వచ్చిన షెల్కే నచికేత్ విశ్వనాథ్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.