ఉద్యోగ ఉపాధ్యాయులను వంచెనకు గురిచేయొద్దు

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్టోపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిలర్ కూశెట్టి పాలకొండయ్య, జిల్లా ఆర్థిక కార్యదర్శి గోశెట్టి రామమోహన్ డిమాండ్ చేశారు. ఆర్థిక పరమైన హామీల విషయంలో ఉద్యోగ ఉపాధ్యాయులను వంచెనకు గురి చేయొద్దని కోరారు. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులోని విద్యాశాఖ కార్యాలయం వద్ద రాష్టోపాధ్యాయ సంఘం ఆధ్వర్యం లో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలాగా నేటి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులను మోసపుచ్చుతూ హామీల అమలులో […]
తుడుమలదిన్నె రైతుకు చేయూత

జీవనాధారానికి మూలమైన ఎడ్లను కోల్పోయి కుంగిపోయిన వైఎస్సార్ కడప జిల్లా తుడుమలదిన్నెకు చెందిన రైతు ఆదిరెడ్డికి ఏపీఐఐసీ మాజీ డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి రూ. 50,000 ఆర్థిక సహాయం అందించి చేయూత నిచ్చారు. ఇటీవల గ్రామం వద్ద ఎడ్లబండితో వాగును దాటుతున్న సమయంలో ప్రవాహానికి కొట్టుకొని పోయి ఎడ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. రైతును ఆదుకునేందుకు తనవంతు సహాయాన్ని గంగాధర్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో వైకాపా నేతలు ఇరగంరెడ్డి నాగేశ్వర్ రెడ్డి , ఆంజనేయ […]
రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం

తెలుగు పద్య పఠనంలో వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలోని జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల బాలిక వీరమల్ల గౌరి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ సంస్థ ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన పోటీలో గౌరి ప్రతిభను ప్రదర్శించారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. బాలిక గౌరిని ప్రిన్సిపాల్ నిర్మల అభినందించారు.
సాంకేతికతకు మూల పురుషుడు

కులవృత్తి గొప్పదనాన్ని, వైభవాన్ని, ప్రభావాన్ని, జీవనాధారాన్ని పెంపొందించడమే.. సాంకేతికతకు మూలపురుషుడైన శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని పిజీఆర్ఎస్ హాలులో జిల్లా బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ జయంతి వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రపంచ తొలి వాస్తు శిల్పి, సృష్టికర్తగా.. ప్రవచనకారులు దేవశిల్పి విశ్వకర్మను ప్రస్తావించడం సమంజసమైనదన్నారు. కేంద్ర రాష్ట్ర […]
భూ సమస్యల ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం చూపాలి

భూ సంబంధిత అర్జీదారులు, ఫిర్యాదుదారుల అర్జీల పట్ల భాధ్యతాయుతంగా వ్యవహరించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్, జేసీ అదితి సింగ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లోని సభాభవన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) లో వచ్చిన ఫిర్యాదులపై డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్రమోహన్, చిన్నయ్య, సర్వే ల్యాండ్స్ ఏడీ మురళీ కృష్ణ , మండలాల తహశీల్దార్లు, ఆర్ఐ, ఎంపిడివోలతో కలిసి సమీక్షా […]
ఉల్లి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా ఇప్పటికే ప్రారంభమైన మైదుకూరు, కమలాపురం ఉల్లి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో రైతుల నుంచి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి కొనుగోలు ప్రక్రియపై. ఉద్యాన, మార్క్ ఫెడ్ శాఖల అధికారులతో సమీక్షించారు. క్వింటాల్ ఉల్లి ధర రూ.1200 /- ప్రకారం e-క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుంచి మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం ఉల్లి పంటను కొనుగోలు చేయడం […]
ప్రజల అప్రమత్తతోనే చైన్ స్నాచింగ్, చోరీలకు అడ్డుకట్ట

చైన్ స్నాచింగ్, చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైదుకూరు అర్బన్ సర్కిల్ ఇన్ స్పెక్టరు కె.రమణారెడ్డి తెలిపారు. పోలీసు సూచనలు పాటించాలని కోరారు. మీరు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో, చుట్టు పక్కల ఎవరైనా అనుమానస్పంగా కొత్త వ్యక్తులు తిరుగుతుంటే వెంటనే 112 పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలన్నారు. బంగారు ఆభరణములు ధరించి మహిళలు ఒంటరిగా వాకింగ్ కు గాని నిర్మానుష్యమైన ప్రదేశం కు వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవ్వరైనా […]
నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి కోసం హెల్ప్ లైన్

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి వైఎస్ఆర్ కడప జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లా కేంద్రం కలెక్టరేట్ ప్రాంగణంలో కంట్రోల్ రూంను ఏర్పాటు ఏర్పాటు చేసింది. సెల్ నెంబరు 08562-246344కు కాల్ చేయాలని సూచించారు. ఖాట్మండ్ హెల్ప్ లైన్ నంబర్లు: 977- 980 860 2881, 977- 981 032 6134 ఏపీకి చెందిన ప్రజల కోసం ఢిల్లీ ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన హెల్ప్ […]
కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధికి వేగంగా అడుగులు

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్, ఐటీ ఉత్పత్తుల తయారీ సంస్థ టెక్నోడోమ్.. కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ లో నూతనంగా ఏర్పాటుచేసిన ఎల్ఈడీ టీవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా టెక్నోడోమ్ ఎల్ఈడీ టీవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు సంస్థ ప్రతినిధులు, సిబ్బంది ఘనస్వాగతం […]
కొప్పర్తికి పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యత నాది

మహిళలు, పురుషులు సమానమని నమ్మే పార్టీ, ప్రభుత్వం.. ఎన్డీయే, తెలుగుదేశం అని, మహిళలకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని కొప్పర్తి ఇండిస్ట్రియల్ హబ్ లో ప్రముఖ రెడీమేడ్ దుస్తుల తయారీ కంపెనీ టెక్సానా మాన్యుఫాక్చరింగ్ నూతన యూనిట్ ప్రారంభం అనంతరం అక్కడ పనిచేసే మహిళా సిబ్బందితో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి […]