Skip to main content

Baskar Pedia

స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన మంత్రి లోకేష్

దేశంలోనే తొలిసారిగా కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె ఎంపీపీ పాఠశాల ఆవరణలో రూ.2కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ డ్ స్మార్ట్ కిచెన్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు. కమలాపురం 2, జమ్మలమడుగు 2, కడపలో 1 స్మార్ట్ కిచెన్ ను మంత్రి లోకేష్ వర్చువల్ గా ప్రారంభించారు. డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఈ 5 స్మార్ట్ కిచెన్ల ద్వారా 136 పాఠశాలలకు చెందిన 10,332 […]

పెండ్లిమర్రిలో ఆదర్శ డిగ్రీ కళాశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్

కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో రూ.12కోట్ల రూసా నిధులతో నిర్మించిన ఆధునాతన ఆదర్శ డిగ్రీ కళాశాల భవనాలను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు. పిఎం ఉష పథకంలో భాగంగా నిర్మించిన పరిపాలన బ్లాక్ ను మంత్రి ప్రారంభించారు. బీఏ ఎకనమిక్స్ ద్వితీయ సంవత్సరం తరగతి గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భావిభారత పౌరులను తయారు చేయడంలో విద్యాశాఖ కీలకమైనదని, కష్టమైనది అయినా భావిభారత పౌరులను తయారుచేసే విద్యాశాఖను […]

ఆలయాలు గ్రామస్థుల మధ్య బంధాలను పెంచేలా ఉండాలి

గ్రామాల్లో నిర్మించే ఆలయాలు గ్రామస్థుల మధ్య బంధాలను పెంచేలా ఉండాలే కానీ గ్రామస్థుల మధ్య విభేదాలను పెంచేలా ఉండకూడదని జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుత్తిలో పెద్దమ్మ తల్లి ఆలయానికి సంబంధించి ప్రహరీ గోడ నిర్మాణ విషయంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన అభ్యంతరాలు,  విభేదాల పరిష్కారం కోసం జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తో కలిసి కలెక్టరు గ్రామం చేరుకుని ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ […]

ఉపాధి వనరుల ఖిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్

జిల్లాలో ప్రధాన ఉపాధి వనరుల ఖిల్లాగా కొప్పర్తి ఏపీఐఐసీ మెగా ఇండస్ట్రియల్ హబ్ వెలుగొందుతోందని ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కొరత లేదని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు.  కొప్పర్తి లో దాదాపు 600 ఎకరాల్లో ఏర్పాటైన మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ను జిల్లా కలెక్టర్, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ కలిసి పరిశీలించారు. సెప్టెంబర్ 2న రాష్ట్ర విద్యాశాఖ, ఐటి […]

మైదుకూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షుడిగా చెన్నకేశవ ప్రసాద్

కడప జిల్లా మైదుకూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షుడిగా బల్లాని చెన్నకేశవ ప్రసాద్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో నిర్వహించిన సమావేశంలో చెన్నకేశవ ప్రసాద్ తోపాటు మరో 35 మంది సభ్యులచే పూర్వసభ అధ్యక్షుడు సూరిశెట్టి శివ వెంకట ప్రసాద్ గుప్తా ప్రమాణ స్వీ కారం చేయించారు. బద్వేలు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బా రావు, తితిదే పూర్వ సభ్యులు ప్రసాద్, మారుతీ ప్రసాద్, ఆర్యవైశ్య సంఘం జిల్లా పూర్వ […]

ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాల బహూకరణ

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కడప జిల్లా పోలీసు పెరేడ్ ప్రాంగణంలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందిస్తున్న  మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్, పక్కన జిల్లా కలెక్టరు చెరుకూరి శ్రీధర్, జేసీ అదితి సింగ్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  

జిల్లాలో ఘనంగా “స్త్రీ శక్తి” పథకం ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “స్త్రీ శక్తి” పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని శుక్రవారం మధ్యాహ్నం కడప ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ప్రారంభించారు.  రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రత్యేకంగా అలంకరించిన పలు […]

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెదేపా విజయం

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్థి మా రెడ్డి లతారెడ్డి విజయం సాధించారు.  మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాఖాలోనే  తెదేపా అభ్యర్థి విజయం సాధించడంతో ఆపార్టీ నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.  తెదేపా అభ్యర్థి లతారెడ్డికి 6713 ఓట్లు లభించగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు లభించాయి.