ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నిక
ఒంటి మిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం నందు ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లో నిల్చున్న ఓటర్లు
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక
పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికకు సంబంధించి ఎర్రబల్లి ప్రాథమిక పాఠశాల లలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం బూత్ నెంబర్లు- 9,10 లలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లో నిల్చున్న ఓటర్లు
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

రోడ్డు భద్రత చర్యలను జిల్లాలో మరింత కఠినతరం చేసి రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబందిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని బోర్డు రూమ్ హాలులో జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న రహదారులపై ఎన్ ఫోర్స్ మెంట్ చర్యలను కఠినతరం చేయాలని, ప్రధాన రహదారుల్లో డివైడర్లను బ్రేక్ చేసి […]
మహిళలసాధికారత కోసమే మిషన్ శక్తి

మహిళల భద్రత, సాధికారతకు కేంద్ర ప్రభుత్వం మిషన్ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో మిషన్ శక్తి కార్యక్రమం అమలుపై జిల్లా స్థాయి మిషన్ శక్తి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ శక్తిలో ‘సంబల్’ మరియు ‘సమర్థ్య’ ఉప పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు వెల్లడించారు. “సంబల్” పథకం మహిళల భద్రతకు, “సమర్థ్య” పథకం మహిళల సాధికారత కోసం ఏర్పాటు చేసిందన్నారు. […]
మైదుకూరు నియోజవర్గ ప్రింట్ మీడియా విలేకరుల సంఘ అధ్యక్షునిగా జి. శ్రీనివాసులు( వాసు) ఏకగ్రీవ ఎన్నిక

మైదుకూరు నియోజకవర్గ ప్రింట్ మీడియా సమావేశం బుధవారం మైదుకూరులోని ఏ వన్ ఫంక్షన్ హాల్ లో ఘనoగా నిర్వహించారు. సమావేశానికి మైదుకూరు నియోజకవర్గం లోని దువ్వూరు ,చాపాడు, ఖాజీపేట, బ్రహ్మంగారిమఠం, మైదుకూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రింట్ మీడియా విలేకరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా యాపరాల వెంకటసుబ్బయ్య ( సాయంకాలం), మైదుకూరు నియోజకవర్గం ప్రింట్ మీడియా […]
ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేయండి

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ విప్, జమ్మలమడుగు శాసన సభ్యులు సి.ఆదినారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆగస్టు 1న ముఖ్యమంత్రి జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువు గ్రామంలో పెన్షన్ లబ్ధిదారులకు […]
వికసిత భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాకారానికి కృషి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షలకు అనుగుణంగా వికసిత భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాకారానికి కృషి చేయాలని 20 సూత్రాల అమలు కార్యక్రమము ఛైర్మన్ లంకా దినకరన్ పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని పీజాఆర్ఎస్ హాలులో మండలాల కార్యక్రమాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల పురోగతి, మౌలిక సదుపాయాల కల్పనలో 20 సూత్రాల కార్యక్రమాల అమలు తీరుపై వివిధ శాఖల అధికారులతో ప్రోగ్రామ్ చైర్మన్ లంకా దినకర్ సమీక్ష నిర్వహించారు. ఈ […]
ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 1న జమ్మలమడుగు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సోమవారం జమ్మలమడుగు మండలంలోని పలు ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సి.ఆదినారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పరిశీలించారు. హెలిప్యాడ్ ఏర్పాటుకు ముద్దనూరు రోడ్డులోని అంబవరం పంచాయతీ పరిధి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పక్కనున్న ఖాళీ ప్రాంతాన్ని పరిశీలించారు. హెలిప్యాడ్ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల భద్రత అంశాలపై జిల్లా […]
క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 27 వ క్యాబినెట్ సమావేశం జరిగింది. పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు శ్రీ కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. కూటమి ప్రభుత్వం లక్ష్యాలను ప్రతిభింబించే విధంగా క్యాబినెట్ సమావేశం జరిగినట్లు మంత్రి స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ది అనేవి రెండు కళ్లుగా ఈ […]
బ్రహ్మంగారిమఠం అభివృద్ధికి రూ.45కోట్లు మంజూరుకు వినతి

వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠంలో కాలజ్ఞానకర్త పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి అయిన బ్రహ్మంగారిమఠం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద పథకం కింద రూ.45కోట్లు మంజూరు చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరినట్లు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే వినతిపత్రం సమర్పించి నిధుల మంజూరుకు కేంద్రానికి సిఫారసు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి డీపీఆర్ తయారీకి ఆదేశించినట్లు వివరించారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ […]