Skip to main content

Baskar Pedia

ఈశ్వరీదేవి 322వ జయంతి మహోత్సవం

కాలజ్ఞానకర్త పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ దంపతుల ప్రధమ పుత్రిక ఈశ్వరీ మహాదేవి జయంతి మహోత్సవం ఈనెల 29న వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో నిర్వహించనున్నారు. 1703 స్వభాను  నామ సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమి పర్వదినాన అవతరించారు. జయంతి మహోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చన, గుడి ఉత్సవం, గ్రామోత్సవంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని మఠాధిపతి వీర శివకుమార స్వామి తెలిపారు.

ప్లాస్టిక్ అనర్థాలపై విస్తృత అవగాహన ఆదేశం

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య అధ్యక్షతన జిల్లాలో ప్లాస్టిక్ నియంత్రణ కు తీసుకుంటున్న చర్యలు మరియు కాలుష్య నియంత్రణ కు తీసుకోవలసిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలసి చైర్మన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ ఒకే వినియోగ ప్లాస్టిక్ (Single Use Plastic – SUP) పై పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MOEF&CC) వారు GSR 320(E) తేదీ […]

200లోపు యూనిట్లు ఉంటేనే ఉచిత విద్యుత్తు

రాష్ట్ర ప్రభుత్వం SC, ST విద్యుత్ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందాలంటే విధిగా ప్రతి నెలా 200 యూనిట్ల లోపు వినియోగం ఉంటేనే వర్తిస్తుందని వైఎస్సార్ కడప జిల్లా  మైదుకూరు  సబ్ డివిజన్ అధికారి శ్రీకాంత్ తెలిపారు.  ఈవిషయాన్ని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు గమనించాలని సూచించారు.  200 యూనిట్లు మించితే ఉచిత విద్యుత్తు వర్తించదని, మొత్తం బిల్లును వినియోగదారుడే భరించాలని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ పథకంపై అవగాహన  కల్పిస్తున్నా ఎక్కువ శాతం SC, […]

జొన్నవరం వద్ద ఎత్తిపోతల పథకానికి రూ.780కోట్లు మంజూరు

వైఎస్సార్ కాంగ్రెస్ నిర్లక్షం చేసినా వైఎస్సార్ కడపజిల్లా దువ్వూరు మండలం జొన్నవరం వద్ద కుందూనది పై ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. రూ.780కోట్లు నిధుల విడుదలకు అంగీకారం తెలిపింది.  త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడనున్నట్లు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు.   ఎగువన వర్షాలు అనుకూలించక కృష్ణానది పరుగులు తీయక పోయినా కర్నూలు, నంద్యాల జిల్లాలో కురిసే వర్షాలతో కుందూనదిలోకి చేరే నీటిని ఒడిసిపట్టి తెలుగుగంగ కాలువలోకి ఎత్తిపోసేలా ఎత్తిపోతల పథకం   ఏర్పాటుకు […]

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా రెడ్యం

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా రెడ్యం వెంకట సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ అధిష్టానవర్గం ప్రకటించింది. రెడ్యంకు పార్టీలో కీలక పదవి లభించడంతో ఆయన అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆయన అభిమానులు ఖాజీపేట కూడలి చేరుకుని మహాత్మాగాంధి, పొట్టిశ్రీరాములు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాణాసంచా పేల్చారు. మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.

జొన్నవరం వద్ద ఎత్తిపోతలకు రూ.780కోట్లు మంజూరు

వైఎస్సార్ కాంగ్రెస్ నిర్లక్షం చేసినా వైఎస్సార్ కడపజిల్లా దువ్వూరు మండలం జొన్నవరం వద్ద కుందూనది పై ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. రూ.780కోట్లు నిధుల విడుదలకు అంగీకారం తెలిపింది.  త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు.   ఎగువన వర్షాలు అనుకూలించక కృష్ణానది పరుగులు తీయక పోయినా కర్నూలు, నంద్యాల జిల్లాలో కురిసే వర్షాలతో కుందూనదిలోకి చేరే నీటిని ఒడిసిపట్టి తెలుగుగంగ కాలువలోకి ఎత్తిపోసేలా ఎత్తిపోతల పథకం […]