ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాల పుస్తక ఆవిష్కరణ

మైసూరు దసరా ఉత్సవాల తరువాత దక్షిణ భారతదేశంలో అత్యంత వైభవంగా ఘనంగా దసరా ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో ప్రొద్దుటూరు అగ్రస్థానంలో నిలుస్తుంది. ఎప్పటిలాగానే ఈయేడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ముద్రించిన ప్రత్యేక పుస్తకాలను ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామమోహన్ కమిటి సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. దసరా ఉత్సవాల విశిష్టత, ఆధ్యాత్మికత, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రజలకు చేరువ చేసేలా పుస్తకాలను రూపొందించారు.
గడియారం వేంకట శేష శాస్త్రి

శతాబ్ధపు మహాకవులలో గడియారం వేంకట శేష శాస్త్రి గారు ఒకరు. శాస్ర్రి గారి శివభారతం మహాకావ్యం మూలంగా చిరస్థాయిగా ప్రజల మనస్సుల్లో చోటు చేసుకోగలదంటూ ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్య తన సంతాపంలో పేర్కొన్నారు. ఈయన కాలిగోటికి కూడా మేము సరిపోము. ఈయన శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని శాస్ర్రి గారి వర్ధంతి సభలో మన పుట్టపర్తి నారాయణాచార్యులు కోరారు. ఎందరో మహానుభావుల్లో అందులో ఒకరైన గడియారం వేంకట శేష శాస్ర్రి మన జిల్లా వాసి అయినందుకు సంతోషించాలి. […]
ఎస్.పి.నాగిరెడ్డి

శెట్టిపల్లె పెద్ద నాగిరెడ్డి. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పెదనాన్న. చాపాడు మండలం నక్కలదిన్నె గ్రామానికి చెందిన పెద్దనాగిరెడ్డి 18వ ఏటనే అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడిగా చేరి ప్రొద్దుటూరు తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర, జిల్లా సభ్యుడిగా ప్రొద్దుటూరు పరిధిలోని ఓబాయపల్లి పంచాయతీ బోర్డు అధ్యక్షుడుగా మూడుసార్లు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. 1959లో మైదుకూరు పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1967 ఫిబ్రవరి నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి […]