Skip to main content

peru-seahorse-162111.hostingersite.com

అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా వైయస్సార్ కడప జిల్లా

     వైఎస్సార్ కడప జిల్లాలో రాజంపేట నియోజకవర్గం కలవడంతో అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా వైయస్సార్ కడప జిల్లా నిలిచిందని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్  అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం లోని రాజంపేట, నందలూరు, వీరబల్లె, సుండుపల్లె మండలాలు జిల్లాలో విలీనమైనట్లు తెలిపారు. ప్రస్తుతం 40 మండలాలతో రాష్ట్రంలోనే అత్యధిక మండలాలు గల జిల్లాగా నిలిచిందని అన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ […]

రాజంపేట డివిజన్ అధికారులతో చర్చించిన కలెక్టరు

జిల్లాల పునర్విభజన తరువాత మొదటిసారి రాజంపేట నియోజకవర్గ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్  చెరుకూరి శ్రీధర్  నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో దర్శనం, ప్రత్యేక అర్చనలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయ పరిశీలనకు వచ్చిన కలెక్టరు  రాజంపేట సబ్ కలెక్టర్ భావన పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. సమావేశ మందిరంలో రాజంపేట రెవిన్యూ డివిజన్ పరిధిలోని మండల తహసీల్దార్లతో సమావేశమయ్యారు. రెవెన్యూ డివిజన్ […]