Skip to main content

Baskar Pedia

వెలిగొండ ప్రాజెక్టు కోసం పోరాటం చేసిన కమ్యూనిస్టు నాయకుడు, మార్కాపురం, యర్రగొండిపాలె నియోజకవర్గాల నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పూల సుబ్బయ్య పేరును పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా నామకరం చేశారు. కృష్ణా వరద జలాలను జంట సొరంగాల ద్వారా మళ్లించి ఫీడర్  కాలువ ద్వారా నల్లమలసాగర్ జలాశయంలో 53.85టీఎంసీలు నిల్వ చేస్తారు. జలాశయం నుంచి తీగలేరు కాలువ, గొట్టిపడియ కాలువ, తూర్పు ప్రధాన కాలువల ద్వారా 4,47,300ఎకరాలకు నీరు సరఫరా చేస్తారు. ప్రకాశం జిల్లాలో 3మండలాలు, మార్కాపురం జిల్లాలో 20మండలాలు, నెల్లూరులో 5మండలాలు, కడప జిల్లా 2మండలాలు కలిపి 30మండలాల ప్రజలు లబ్దిపొందనున్నారు.

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్-1

సొరంగం లోపలి వ్యాసం: 7.2మీటర్లు
సొరంగం పొడవు: 18.80మీటర్లు
నీటి పరిమాణము: 85 ఘ.మీ/సెకనుకు
నీటి ప్రవాహ వేగం: 2.71 మీ/సెకను
ఆయకట్టు: 1,19,000

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్-2

సొరంగం లోపలి వ్యాసం: 9.2మీటర్లు
సొరంగం పొడవు: 18.838మీటర్లు
నీటి పరిమాణము: 243 క్యూమెక్స్
నీటి ప్రవాహ వేగం: 3.89 మీ/సెకను
ఆయకట్టు: 3,24,000

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 4,47,300  ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. మొదటివిడతలో 1,19,000 ఎకరాలకు, రెండోవిడతలో 328300ఎకరాలకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ధేశించుకుంది. 53.85టీఎంసీలు సామర్థ్యం కలిగిన నల్లమలసాగర్ జలాశయం ప్రస్తుతం 10.70టీఎంసీలు నిల్వ చేస్తారు.

తొలిదశలో నీరు అందే మండలాలు-ఆయకట్టు

యర్రగొండపాలెం నియోజకవర్గం
పెద్దదోర్నాల6,100
పెద్దారవీడు2,1900
పుల్లల చెరువు11,500
త్రిపురాంతకం7,000
యర్రగొండపాలెం19,800
మార్కాపురం నియోజకవర్గం
మార్కాపురం17,700
తుర్లుపాడు13,000
గిద్దలూరు నియోజకవర్గం
అర్థవీడు1,500
బేస్తవారపేట10,700
కంభం9,800

రెండో దశలో

మార్కాపురం నియోజకవర్గం
కొనకమిట్ల30,000
మార్కాపురం10,000
పొదిలి5,200
తుర్లుపాడు 7,000
గిద్దలూరు నియోజకవర్గం
అర్ధవీడు1,500
బేస్తవారపేట500
కంభం7,500
గిద్దలూరు10,600
కొమరోలు5,500
రాచర్ల11,500
కనిగిరి నియోజకవర్గం
సీఎస్ పురం24,200
హనుమంతునిపాడు39,400
కనిగిరి19,300
పామూరు9,300
వెలిగండ్ల12,600
దర్శి నియోజకవర్గం
దొనకొండ17,000
కురిచేడు6,000
ఉదయగిరి నియోజకవర్గం
దుత్తలూరు20,000
సీతారాంపురం7,500
ఉదయగిరి15,250
వరికుంటపాడు20,250
ఆత్మకూరు నియోజకవర్గం
మర్రిపాడు21,000
బద్వేలు నియోజకవర్గంలో
కలసపాడు17,600
పోరుమామిళ్ల 9,600

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *