వెలిగొండ ప్రాజెక్టు కోసం పోరాటం చేసిన కమ్యూనిస్టు నాయకుడు, మార్కాపురం, యర్రగొండిపాలె నియోజకవర్గాల నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పూల సుబ్బయ్య పేరును పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా నామకరం చేశారు. కృష్ణా వరద జలాలను జంట సొరంగాల ద్వారా మళ్లించి ఫీడర్ కాలువ ద్వారా నల్లమలసాగర్ జలాశయంలో 53.85టీఎంసీలు నిల్వ చేస్తారు. జలాశయం నుంచి తీగలేరు కాలువ, గొట్టిపడియ కాలువ, తూర్పు ప్రధాన కాలువల ద్వారా 4,47,300ఎకరాలకు నీరు సరఫరా చేస్తారు. ప్రకాశం జిల్లాలో 3మండలాలు, మార్కాపురం జిల్లాలో 20మండలాలు, నెల్లూరులో 5మండలాలు, కడప జిల్లా 2మండలాలు కలిపి 30మండలాల ప్రజలు లబ్దిపొందనున్నారు.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్-1
సొరంగం లోపలి వ్యాసం
: 7.2మీటర్లు
సొరంగం పొడవు
: 18.80మీటర్లు
నీటి పరిమాణము
: 85 ఘ.మీ/సెకనుకు
నీటి ప్రవాహ వేగం
: 2.71 మీ/సెకను
ఆయకట్టు
: 1,19,000
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్-2
సొరంగం లోపలి వ్యాసం
: 9.2మీటర్లు
సొరంగం పొడవు
: 18.838మీటర్లు
నీటి పరిమాణము
: 243 క్యూమెక్స్
నీటి ప్రవాహ వేగం
: 3.89 మీ/సెకను
ఆయకట్టు
: 3,24,000
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. మొదటివిడతలో 1,19,000 ఎకరాలకు, రెండోవిడతలో 328300ఎకరాలకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ధేశించుకుంది. 53.85టీఎంసీలు సామర్థ్యం కలిగిన నల్లమలసాగర్ జలాశయం ప్రస్తుతం 10.70టీఎంసీలు నిల్వ చేస్తారు.