రాయలసీమ, ప్రకాశం మరియు మార్కాపురం ప్రాంతాలను భారతదేశంలోనే అత్యంత కీలకమైన గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా (ప్రపంచ ఉద్యాన కేంద్రం) అభివృద్ధికి ఉద్దేశించిన బృహత్తర ప్రాజెక్టును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం రీల్, వీడియో పోటీ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు.
రాయలసీమ ప్రాంత అభివృద్ధి, సాగునీటి మౌలిక వసతుల కల్పన, తోటబడుల విస్తరణ, రైతుల సాధికారతను ప్రతిబింబించేలా క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, విద్యార్థులు మరియు డిజిటల్ క్రియేటర్లు తమ సృజనాత్మక వీడియోతో డిజిటల్ మాధ్యమాల్లో భాగస్వాములు కావాలన్నరు.
ఈ పోటీకి సంబంధించిన 60 నుంచి 90 సెకన్ల నిడివి కలిగిన వీడియోలను సెప్టెంబర్ 27వ తేది నుంచి సెప్టెంబర్ 30వ తేది మధ్యాహ్నం 12గంటలలోగా స్వీకరించనున్నట్లు తెలిపారు. అత్యుత్తమ 5 వీడియోలను సెప్టెంబర్ 30 సాయంత్రానికి ఎంపిక చేసి అక్టోబర్ 1న విజేతలను ప్రకటిస్తామన్నారు. ఎంపికైన టాప్-5 వీడియోల క్రియేటర్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా సన్మానిస్తారని పేర్కొన్నారు.
పోటీదారులు తమ వీడియోలను సోషల్ మీడియా వేదికల్లో అప్‌లోడ్ చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ అధికారిక ఖాతా @APOfficialNews ను తప్పనిసరిగా ట్యాగ్ లేదా కొల్లాబరేట్ చేయాలని స్పష్టం చేశారు. RayalaseemaRising, #GlobalHorticultureHub, #PrapanchaUdhyanaKendram, మరియు #APOfficialNews వంటి అధికారిక హ్యాష్‌ట్యాగ్‌లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.
