
శతాబ్ధపు మహాకవులలో గడియారం వేంకట శేష శాస్త్రి గారు ఒకరు. శాస్ర్రి గారి శివభారతం మహాకావ్యం మూలంగా చిరస్థాయిగా ప్రజల మనస్సుల్లో చోటు చేసుకోగలదంటూ ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్య తన సంతాపంలో పేర్కొన్నారు. ఈయన కాలిగోటికి కూడా మేము సరిపోము. ఈయన శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని శాస్ర్రి గారి వర్ధంతి సభలో మన పుట్టపర్తి నారాయణాచార్యులు కోరారు. ఎందరో మహానుభావుల్లో అందులో ఒకరైన గడియారం వేంకట శేష శాస్ర్రి మన జిల్లా వాసి అయినందుకు సంతోషించాలి. గర్వపడాలి. ప్రతి ఒక్కరూ మన గడియారం గురించి తెలుసుకోవాలి. నాటి మహానుభావులను భావితరాలకు తెలియజేయాలి.
పేరు | గడియారం వేంకట శేష శాస్త్రి |
జననం | 1894 ఏప్రిల్ 07 |
మరణం | 1980 సెప్టెంబరు 20 |
గ్రామం | నెమళ్లదిన్నె |
స్థిర నివాసం | ప్రొద్దుటూరు |
మండలం | పెద్దమొడియం |
తల్లిదండ్రులు | రమణయ్య, నరసమ్మ |
ధర్మపత్ని : | వెంకటసుబ్బమ్మ |
పుత్రులు : | రామశేషయ్య, వెంకటసుబ్రమణ్యం |
1932లో ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ పురపాలిక ఉన్నత పాఠశాలలో తెలుగుపండితులుగా పని చేశారు.
చేపట్టిన పదవులు : 1959నుంచి 1968వరకు శాసనమండలి సభ్యునిగా పనిచేశారు. 1969నుంచి 1973వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ఉపాధ్యక్షులుగా పనిచేశారు.
రాసిన గ్రంధాలు : శ్రీశివభారతం గడియారం వారికి చిరకీర్తిని తెచ్చిపెట్టింది. గోవర్ధన సప్తశతి, ఉత్తర రామాయణం గ్రంధాలను సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. పుష్పబాణ విలాసం, వాస్తు జంత్రి, మల్లికా మారుతం, శ్రీనాధ కవితా సామాజ్యం, రఘునాధీయం, వాల్మీకి హృదయావిష్కరణ గ్రంధాలను రచించారు.