తెలుగు సాహితీ లోకంలో విశేష కృషి చేసిన వారిలో నారు నాగసూర్య ఒకరు. బ్రాహ్మణేతర కవుల్లో అగ్రగామిగా నిలిచారు. ఉత్తమ సాహితీవేత్తగా ప్రశంసలు అందుకున్నారు. పెద్దన మనుచరిత్రను, ముక్కు తిమ్మన పారిజాతాపహరణాన్ని అచ్చతెలుగులో అనువదించారు.వీరపూజ, శ్రీ పృథ్వీరాజవిజయము, తిలోత్తమాసాహసికము, శకుంతల, ఊర్వశి, వెన్నెల పెళ్ళి, రామకత, ఉషారాజ్ఞి, ధ్యానమాలిని, ప్రణయిని, శ్రీ రమణాభ్యుదయము, ఆర్యవాణి, తెలుగుతల్లి శతకము, సౌందర్యలహరి, శ్రీ మలయాళ సద్గురు దండకం, శ్రీ రమణానుగ్రహ స్తుతి, కేనోపనిషత్తు, యతిగీతం, శ్రీ హృదయాభ్యుదయము, శ్రీరామహృదయం, లక్ష్మణహృదయం, దేవయాని, కష్టజీవి, పరాధీన భారతం, సత్యాన్వేషి, ఉద్బోధ, వసంతోదయం మొదలైనవి. ఈయన రచనలు గడియారం వేంకట శేషశాస్త్రి, జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ వంటి పండితుల ప్రశంసలు అందుకున్నాయి.
జీవిత విశేషాలు
జననం తేదీ: జూలై 3, 1903
పుట్టిన ప్రదేశం: రాఘవరాజుపురం అగ్రహారం గ్రామం, రైల్వే కోడూరు మండలం, అన్నమయ్య జిల్లా
తల్లిదండ్రులు: సుబ్బమ్మ, నరసింహం దంపతులు.
మరణం: జనవరి 18, 1973
బిరుదులు: విద్వత్కవి, కవితాకళానిధి
విద్య: నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అష్టావధాని అల్లాడి జగన్నాథశాస్త్రి వద్ద ఛందస్సు, అలంకార శాస్త్రాలు, జనమంచి శేషాద్రిశర్మ వద్ద శ్రీవిద్య ఉపాసనము చేశారు.
స్వాతంత్ర్య సమరయోధుడు: 1921లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. పర్లపాడు సత్యాగ్రహాశ్రమంలో నివసించి ఖద్దరు సేవ చేశారు. 1923, 1947లలో సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు.