
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య అధ్యక్షతన జిల్లాలో ప్లాస్టిక్ నియంత్రణ కు తీసుకుంటున్న చర్యలు మరియు కాలుష్య నియంత్రణ కు తీసుకోవలసిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలసి చైర్మన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ ఒకే వినియోగ ప్లాస్టిక్ (Single Use Plastic – SUP) పై పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MOEF&CC) వారు GSR 320(E) తేదీ 18.03.2016 ప్రకారం ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాలు (Plastic Waste Management Rules, 2016) ను జారీ చేశారని, తరువాతగా ఈ నియమాలను GSR 285(E) (27.03.2018), GSR 571(E) (12.08.2021), GSR 133(E) (16.02.2022) మరియు GSR 522(E) (06.07.2022) ద్వారా సవరించారని తెలిపారు.
PWM సవరణ నియమం, 2021 ప్రకారం:2021 సెప్టెంబర్ 30 నుంచి, క్యారీ బ్యాగులు మరియు ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ల మందం కనీసం 75 మైక్రాన్ లకు తక్కువ కాకూడదని, 2022 డిసెంబర్ 31 నుంచి ఈ మందం కనీసం 120 మైక్రాన్ లకుతక్కువకాకూడదనీ,నాన్-వోవెన్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు 2021 సెప్టెంబర్ 30 నుంచి కనీసం 60 GSM ఉండాలనన్నారు.
- 2022 జూలై 1 నుండి నిషేధించిన SUP వస్తువులు
ప్లాస్టిక్ స్టిక్స్‌తో కూడిన ఇయర్ బడ్స్, బెలూన్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, ఐస్ క్రీమ్ స్టిక్స్, పాలిస్టైరిన్ డెకరేషన్ వస్తువులు (థర్మకోల్) ప్లేట్లు, గ్లాసులు, కప్‌లు, ఫోర్కులు, స్పూన్లు, స్ట్రా, ట్రేలు, స్వీట్ బాక్స్‌లు, ఆహ్వాన పత్రికలు, సిగరెట్ ప్యాకెట్లు చుట్టే ప్లాస్టిక్, 100 మైక్రాన్ల కన్నా తక్కువ ప్లాస్టిక్ బ్యానర్లు, కంపోస్టబుల్ ప్లాస్టిక్‌తో తయారైన వస్తువులకు నిషేధం వర్తించదనన్నారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం O.Ms.No.81, EFS&T శాఖ, తేదీ 29.11.2022 ద్వారా అమలు కు అధికారులను నియమించి, నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు విధించాలన్నారు.
- ప్రధానంగా జిల్లా లోని అర్బన్ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్లు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారి ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకొని ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. దీనితోపాటు పక్కాగా డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణతో పాటు ఈ అంశాన్ని పర్యవేక్షించేందుకు క్షేత్రస్థాయిలో గల సచివాలయ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేసి మరింత అవగాహన కల్పించాలన్నారు… జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలో ఎక్కువగా ఉన్నందున ఇందులో నుంచి వచ్చే వ్యర్థ పదార్థాల వల్ల కాలుష్యం కాకుండా కాలుష్య నియంత్రణకు తీసు కోవలసిన చర్యలపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలన్నారు.. రోడ్డుకి ఇరువైపులా వేస్ట్ ను డంపింగ్ చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని దీని అరికట్టాలని సూచించారు.
- ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టేందుకు ప్రధానంగా బస్ స్టేషన్లు,రైల్వే స్టేషన్లలో తనిఖీలు,ప్రయాణికులకు అవగాహన కలిగించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.పట్టణ గ్రామీణ ప్రాంతాలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరికట్టేందుకు మార్కెట్ ,హోల్ సేల్ షాపులలో తనిఖీలు నియమ నిబంధనలను అతిక్రమించిన వారిపై జరిమానాల విధించాలన్నారు..
- ప్రత్యామ్నాయంగా సంచి బ్యాగులు, క్లాత్ బ్యాగులు వినియోగాన్ని ప్రోత్సహించాలనన్నారు. గ్రామాలలో ప్లాస్టిక్ లేని పంచాయతీలు గా మార్చేందుకు తీర్మానం చేయాలన్నారు.దేవాలయాలలో ప్రసాదం, అన్నదానము పంపిణీ కి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో అందించేలా చర్యలు చేపట్టాలన్నారు.
- జిల్లా జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో కాలుష్య నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై ఎంపీడీఓ లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించి ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చైర్మన్ కు వివరించారు..
ఈ సమావేశం లో ఈఈ కాలుష్య నియంత్రణ మండలి సుధ,జి ఎం పరిశ్రమల శాఖ చాంద్ భాష,జెడ్ ఎం ఏపీఐఐసి శ్రీనివాస మూర్తి, కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు..