
కాలజ్ఞానకర్త పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ దంపతుల ప్రధమ పుత్రిక ఈశ్వరీ మహాదేవి జయంతి మహోత్సవం ఈనెల 29న వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో నిర్వహించనున్నారు. 1703 స్వభాను నామ సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమి పర్వదినాన అవతరించారు. జయంతి మహోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చన, గుడి ఉత్సవం, గ్రామోత్సవంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని మఠాధిపతి వీర శివకుమార స్వామి తెలిపారు.