పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్థి మా రెడ్డి లతారెడ్డి విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాఖాలోనే తెదేపా అభ్యర్థి విజయం సాధించడంతో ఆపార్టీ నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తెదేపా అభ్యర్థి లతారెడ్డికి 6713 ఓట్లు లభించగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు లభించాయి.
