రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “స్త్రీ శక్తి” పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని శుక్రవారం మధ్యాహ్నం కడప ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ప్రారంభించారు. రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రత్యేకంగా అలంకరించిన పలు బస్సులకు రాష్ట్ర మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
