జీవనాధారానికి మూలమైన ఎడ్లను కోల్పోయి కుంగిపోయిన వైఎస్సార్ కడప జిల్లా తుడుమలదిన్నెకు చెందిన రైతు ఆదిరెడ్డికి ఏపీఐఐసీ మాజీ డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి రూ. 50,000 ఆర్థిక సహాయం అందించి చేయూత నిచ్చారు. ఇటీవల గ్రామం వద్ద ఎడ్లబండితో వాగును దాటుతున్న సమయంలో ప్రవాహానికి కొట్టుకొని పోయి ఎడ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. రైతును ఆదుకునేందుకు తనవంతు సహాయాన్ని గంగాధర్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో వైకాపా నేతలు ఇరగంరెడ్డి నాగేశ్వర్ రెడ్డి , ఆంజనేయ కొట్టాలు సర్పంచ్ పెద్దిరెడ్డి, త్రిపురవరం వైకాపా నేత సుబ్బారెడ్డి ఖాజీపేట ఎంపిటిసి జంగిటి శివప్రసాద్ ,రావులపల్లి సర్పంచ్ శివరామిరెడ్డి, కొత్తపేట గోపాల్ రెడ్డి , సుంకేసుల మాజీ డీలర్ పెద్ది సుబ్బారెడ్డి , మండల రైతువిభాగం అధ్యక్షుడు గంగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , సుంకేసుల వైకాపా నేత దుగ్గిరెడ్డి బసన్నగారి సుబ్బారెడ్డి, దుగ్గిరెడ్డి తిమ్మారెడ్డిగారి శ్రీనివాసులరెడ్డి , కంది నాగసుబ్బారెడ్డి , కండక్టర్ శ్రీనివాసులురెడ్డి , నందిపాడు వార్డ్ మెంబర్ ఆదినారాయణ రెడ్డి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ మూలే శ్రీనాథ రెడ్డి లు పాల్గొన్నారు.
