
కర్నూలు జిల్లా మండల కేంద్రం హొళగుందలోని తేరుబజారులో ఎదురు బసవన్న ఆలయం కర్నాటక రాష్ట్రం హంపిలోని రాతి రథాన్ని పోలి ఉంది. నాలుగు పెద్ద రాతి చక్రాలతో ఉన్న బసవన్న ఆలయం ఆకర్షిస్తోంది. గతంలో సిద్ధేశ్వర స్వామి జాతర సందర్భంగా రాతి రథాన్ని లాగేవారని, దాదాపు 200ఏళ్ల కిందట రథ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. కర్నాటక రాష్ట్రంలో శ్రీకృష్ణదేవరాయలు ఏలిన విజయనగర సామ్రాజ్యంలో హంపి ఉండటం… మండల కేంద్రం హొళిగుంద కర్నాటక సరిహద్దులో ఉండటమే కాకుండా రాయలు ఏలిన వాటిల్లో హొళిగుంద ఉండటం విశేషం.