
వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట ఎస్సీకాలనీ దక్షిణ దిశలో 18వ శతాబ్దం నాటి విగ్రహం విగ్రహం వెలుగులోకి వచ్చింది. ఇది ఒక మహిళా విగ్రహం. ఎడమవైపు కొప్పు ధరించి, మెడలో పెండెంట్ (పతకo) ధరించి, ఎడమవైపు చేతిలో ఒక చంటి పిల్లోడిని నడుముకు కట్టుకొని కనిపిస్తోంది. కుడివైపు చేతిలో ఒక పుష్పం, నడుము నుంచి వస్త్రాదరణ చేసినట్టు . కాళ్లకు, చేతులకు కడియాలు ధరించిన్నట్లు చిత్రీకరించారన్నారు. చెవులు చాలా పెద్దవిగా ఉన్నాయి. కడప యోగివేమన విశ్వవిద్యాలయ లలిత కళల విభాగపు సహాయ ఆచార్యులు కోట మృత్యుంజయ్ రావు 18వ శతాబ్దం నాటి విగ్రహంగా స్పష్టం చేశారని రచయిత చరిత్రకారుడు బొమ్మశెట్టి రమేష్ తెలిపారు.