
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షలకు అనుగుణంగా వికసిత భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాకారానికి కృషి చేయాలని 20 సూత్రాల అమలు కార్యక్రమము ఛైర్మన్ లంకా దినకరన్ పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని పీజాఆర్ఎస్ హాలులో మండలాల కార్యక్రమాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల పురోగతి, మౌలిక సదుపాయాల కల్పనలో 20 సూత్రాల కార్యక్రమాల అమలు తీరుపై వివిధ శాఖల అధికారులతో ప్రోగ్రామ్ చైర్మన్ లంకా దినకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతీ ఆయోగ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయడానికి 117 ఆకాంక్ష జిల్లాలను ఎంపిక చేసిందన్నారు. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ జిల్లా, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం జిల్లాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. జిల్లాల్లో సామాజిక స్థాయిని(అభివృద్ధి)… ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ప్రతి మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి ఒకసారి.. 5 అంశాలకు సంబంధించి.. కీ పారామీటర్ ఇండికేట్ (కెపిఐ) పాయింట్ల ఆధారంగా.. ప్రగతిని లెక్కించడం జరుగుతుందన్నారు. హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ – నైపుణ్యాభివృద్ధి, గృహనిర్మాణం, వ్యవసాయం, పశుపోషణ, మౌలిక సదుపాయాలు …మొదలైన శాఖల్లో నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో మరింత పురోగతి సాధించాలని సూచించారు. అందుకోసం.. సంబందిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సంతృప్త స్థాయిలో నిర్దేశిత లక్ష్యం మేరకు సాధించిన ప్రగతి ఆధారంగా.. ప్రోత్సాహకాలను కూడా భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఆ మేరకు.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
అన్ని శాఖల పరిధిలో కొరత ఉన్న సౌకర్యాలు, సదుపాయాలు, అవసరాలను ఎప్పటికప్పుడు సంపూర్తి చేయాలన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ ఇన్నోవేటీవ్ గా ఆలోచించాలన్నారు. వినూత్నమైన ఆలోచనలకు నిర్మాణ రూపం ఇచ్చేందుకు ప్రతి శాఖ సంసిద్ధం అవ్వాలని సూచించారు.కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలలో పురోగతిపై సమీక్షించారు.ప్రధానంగా ఆకాంక్షిత జిల్లాల్లో కన్వర్జేన్స్, కో ఆపరేషన్, కాంపిటీటివ్ తరహాలో ముందుకెళ్లి వెనుకబడిన అంశాలపై దృష్టి సారించి పురోగతి సాధించాలన్నారు.
ఆకాంక్షిత మండలాల్లో భాగంగా జిల్లాలో రెండు జమ్మలమడుగు, సికెదిన్నె మండలాలను గుర్తించడం జరిగిందన్నారు. ఇక్కడ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం, ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పౌష్టికాహార లోపం, సాయిల్ హెల్త్ వంటి అంశాలపై వెనుకబడి ఉన్నాయని 2024 లో సంపూర్ణ అభియాన్ కార్యక్రమం ఈ మండలాల్లో ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా వాటిలో పురోగతి సాధించడం వల్ల నీతి అయోగ్ రెండు కోట్లు ప్రోత్సాహక అందించిందన్నారు. ఇందులో సీకే దీన్నే, జమ్మలమడుగులో ఒక్కొక్క కోటి చొప్పున కేటాయించి స్మార్ట్ కిచెన్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా జిల్లాలో ప్రధానంగా చేపడుతున్న… 10 అంశాలైన 1. జిరో పావర్టీ, 2. ఎంప్లాయిమెంట్, 3. స్కిల్ & హ్యూమన్ రిసోర్స్ డెవెలప్మెంట్, 4. వాటర్ సెక్యురిటీ, 5. వ్యవసాయం – అధునాతన సాంకేతికత, 6. గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, 7. కాస్ట్ ఆప్టిమైజెషన్, 8. ప్రాడక్ట్ పర్ఫెక్షన్, 9. స్వచ్ఛ ఆంధ్ర, 10. డీప్ టెక్ – ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్.. అంశాలపై సమీక్షించారు. . అంతేకాకుండా… కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం జన్ ఆరోగ్య యోజన, పీఎం మాతృ వందన యోజన, పోషణ అభియాన్, పీఎం శ్రీ స్కూల్స్, పీఎం కిసాన్ సన్ నిధి, పీఎం ముద్ర యోజన, పీఎం ఆవాస్ యోజన, జలజీవన్ మిషన్, స్వచ్ఛభారత్ మిషన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన వర్నేషన్ వన్ రేషన్ కార్డ్, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
జిల్లాలో ప్రధానంగా వ్యవసాయ అనుబంధ రంగాలైన ఉద్యాన పంటల సాగుకు జిల్లాలో అపారమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని. వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి సాధనలో భాగంగా.. ఆర్థిక పరిపుష్టి, నైపుణ్య అభివృద్ధి అనే అంశాల్లో.. ఫిబ్రవరి 2024 వరకు ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గాను.. జిల్లాకు రూ. 3 కోట్ల నగదు పురస్కారాన్ని నీతీ ఆయోగ్ ప్రకటించిందన్నారు. 2.85 కోట్లతో మహిళ మార్ట్ లు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లలో లక్పతి దీదీ వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మహిళల్లో ఆర్థిక స్వాలంబన జరిగిందన్నారు అలాగే కడప పట్టణంలో ఈట్ స్ట్రీట్ ను ప్రారంభించడం జరిగిందన్నారు అలా అంగన్వాడి కేంద్రాలలో శానిటేషన్, ఆగ్రో మార్కెట్ పనులు జరుగుతున్నాయన్నారు
అన్ని అంశాల్లో కూడా.. జాతీయ స్థాయిలో జిల్లా మంచి స్థానంలో ముందుకు సాగుతోందన్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది సమన్వయంతో వైఎస్ఆర్ జిల్లా నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ, రాష్ట్ర పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడమే లక్ష్యంగా వినూత్న వ్యూహాలతో చురుకైన పాలన సాగించడం వల్ల నిర్ణీత కాలంలోనే ఆకాంక్షిత జిల్లా లక్ష్య సాధన మరింత సులువుగా మారుతుందని తెలిపారు
ఈ సమావేశంలో సిపిఓ హజరతయ్య, వ్యవసాయ శాఖ జెడి చంద్ర నాయక్, పశు సంవర్ధన శాఖ జేడి శారదమ్మ ,ఆర్డబ్ల్యుయస్ ఈఈ ఏడుకొండలు, ఎల్ డి ఎం.జనార్ధన ,వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.