కడప జిల్లా మైదుకూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షుడిగా బల్లాని చెన్నకేశవ ప్రసాద్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో నిర్వహించిన సమావేశంలో చెన్నకేశవ ప్రసాద్ తోపాటు మరో 35 మంది సభ్యులచే పూర్వసభ అధ్యక్షుడు సూరిశెట్టి శివ వెంకట ప్రసాద్ గుప్తా ప్రమాణ స్వీ కారం చేయించారు. బద్వేలు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బా రావు, తితిదే పూర్వ సభ్యులు ప్రసాద్, మారుతీ ప్రసాద్, ఆర్యవైశ్య సంఘం జిల్లా పూర్వ అధ్యక్షుడు దొంతు సుబ్రహ్మణ్యం, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉమాదేవి పాల్గొన్నారు.
