ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్టోపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిలర్ కూశెట్టి పాలకొండయ్య, జిల్లా ఆర్థిక కార్యదర్శి గోశెట్టి రామమోహన్ డిమాండ్ చేశారు. ఆర్థిక పరమైన హామీల విషయంలో ఉద్యోగ ఉపాధ్యాయులను వంచెనకు గురి చేయొద్దని కోరారు. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులోని విద్యాశాఖ కార్యాలయం వద్ద రాష్టోపాధ్యాయ సంఘం ఆధ్వర్యం లో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలాగా నేటి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులను మోసపుచ్చుతూ హామీల అమలులో కాలయాపన చేస్తోందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమ పథకాలను అమలు చేయలేదని, రెండేళ్లవుతున్నా 12వ పీఆర్సీ అమలు చేయలేదని, మధ్యంతర భృతి ప్రకటన చేయలేదన్నారు. వెంటనే మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. నాలుగు డీఏల బకాయి ఉందన్నారు. ఆర్థిక ప్రయోజనాల సాధనకు ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని, డీఎస్సీ 2025 ద్వారా అన్ని ఖాళీలు భర్తీ చేసి బదిలీ పొందిన ప్రతి ఉపాధ్యాయుడికి రిలీవర్లను కేటా యించాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు మల్లేశ్వర్ రెడ్డి, సురేష్, చంద్రశేఖర్, నారాయణ ప్రసాద్ ,నాగరాజు కుమార్, కిరణ్, నరసింహ రాజు, విజయుడు, ఈశ్వరయ్య, కొండయ్య, హజరత్, నాయక్, రవీంద్రారెడ్డి, బాలరాజు,రమణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు
