వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లెలో ఈ నెల 11వ తేది నుంచి ఈశ్వరీ మహాదేవి ఆరాధన గురు పూజ మహోత్సవం నిర్వహించనున్నారు. 11న పంచామృతాభిషేకం, కుంకుమార్చన పూజలు, రాత్రి కలశోత్సవం, కలశ స్థాపన ఉత్సవం, 12న పంచామృత అభిషేకం, కుంకుమార్చన పూజలు, అశ్వవాహన ఉత్సవం, రాత్రి హంస వాహన ఉత్సవం, 13న ఈశ్వరీ మహాదేవి సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం సందర్భంగా పంచామృతాభిషేకం, కుంకుమార్చన పూజలు, దీక్షా అలంకరణ ఉత్సవం, సింహ వాహన గ్రామోత్సవం, 14న రాత్రి పుష్ప రథోత్సవం, కోలాటం, 15న పూర్వ మఠాధిపతులు వీర బ్రహ్మయ్య ఆచార్య స్వాముల వారి ఆరాధన, రాత్రి గ్రామ ఉత్సవం, గీతా పారాయణం, 16న మహాప్రసాద వినియోగం ఉంటుందని పీఠాధిపతి వీర కుమారస్వామి తెలిపారు. ఈశ్వరీ మహేదేవి దర్శనం కోసం బ్రహ్మంగారిమఠం వెళ్లాలనుకునే భక్తులకు మైదుకూరు నుంచి బస్సు సౌకర్యం కలదు.
