రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిన గౌరితో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నిర్మల
తెలుగు పద్య పఠనంలో వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలోని జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల బాలిక వీరమల్ల గౌరి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ సంస్థ ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన పోటీలో గౌరి ప్రతిభను ప్రదర్శించారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. బాలిక గౌరిని ప్రిన్సిపాల్ నిర్మల అభినందించారు.
