
ఎర్రకాళ్లు.. నల్లరంగు ఈకలతో రెక్కలు…ఊదారంగు ముక్కుతో ఉన్న పక్షులు వైఎస్సార్ కడప జిల్లా చాపాడు మండలం గాంధీనగర్ గ్రామానికి తరలివచ్చాయి. సంతానోత్పత్తి కోసం వేల కి.మీ ప్రయాణించి చేరుకున్న విదేశీ పక్షులు ఏటా జూన్ నెలలో చేరుకుంటాయి. సంతానంతో డిసెంబరు ఆఖరునాటికి తిరిగి వెళ్లిపోనున్నాయి. ఒకవైపు కుందూనది మరోవైపు పెన్నానది ఇంకోవైపు పాపాఘ్ని నదులు ఆహార వేటకు అనుకూలంగా ఉండటంతో గాంధీనగర్ గ్రామానికి ఏటా పక్షులు తరలి వస్తున్నాయి. గ్రామానికి చేరుకున్న పక్షులను వేటగాళ్ల బారిన పడకుండా కాపాడుకుంటున్నారు. పక్షులు గ్రామానికి చేరితే కేసీకాలువకు నీరు చేరి కరవు ఉండదనే నమ్మకం గ్రామస్తుల్లో ఉంది.