
కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాలో కేసీకాలువ ఆయకట్టు కింద కర్నూలు, నంద్యాల జిల్లాలో 173627ఎకరాలు, కడప జిల్లాలో 92,001 ఎకరాలకు సాగునీరు అందాలి. అయితే కాలువకు సాగునీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహించాలో తెలుసుకుందాం.
- సుంకేశుల ఆనకట్ట నుంచి లాకెన్సుల వరకు (0.000కి.మీ నుంచి 120.19కి.మీ) 120.19కి.మీ
- లాకెన్సుల నుంచి సంతజూటూరు వరకు (120.19కి.మీ నుంచి 150.65కి.మీ) 30.46కి.మీ
- సంతజూటూరు ఆనకట్ట నుంచి రాజోలి ఆనకట్ట వరకు (150.65కి.మీ నుంచి 234.64కి.మీ) 83.99కి.మీ
- రాజోలి ఆనకట్ట నుంచి ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వరకు (234.64కి.మీ నుంచి 291.00కి.మీ) 56.36
- ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట నుంచి కృష్ణాపురం వరకు (291.00కి.మీ నుంచి 305.86కి.మీ) 14.86కి.మీ