మైదుకూరు నియోజకవర్గ ప్రింట్ మీడియా సమావేశం బుధవారం మైదుకూరులోని ఏ వన్ ఫంక్షన్ హాల్ లో ఘనoగా నిర్వహించారు. సమావేశానికి మైదుకూరు నియోజకవర్గం లోని దువ్వూరు ,చాపాడు, ఖాజీపేట, బ్రహ్మంగారిమఠం, మైదుకూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రింట్ మీడియా విలేకరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షులుగా యాపరాల వెంకటసుబ్బయ్య ( సాయంకాలం), మైదుకూరు నియోజకవర్గం ప్రింట్ మీడియా అధ్యక్షునిగా జి. శ్రీనివాసులు (వాసు) (ఆంధ్రజ్యోతి విలేకరి), ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసులు రెడ్డి (సూర్య), కోశాధికారిగా సునీల్ ను (ఆంధ్రప్రభ విలేకరి)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా భూమిరెడ్డి రవి కళ్యాణ్ (మైదుకూరు), కొప్పరపు వెంకటసుబ్బయ్య (మైదుకూరు), బ్రహ్మానంద రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి (ఖాజీపేట), నాగేష్ నాయుడు (బ్రహ్మంగారిమఠం), సింగ్ (దువ్వూరు), వెంకట స్వామి (చాపాడు), శిఖామణి (బ్రహ్మంగారిమఠం), పోకల సుబ్బరాయుడు (మైదుకూరు) వీరితోపాటు పలువురు సహాయ కార్యదర్శులు, కార్యదర్శులుగా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా మైదుకూరు నియోజకవర్గ రెంట్ మీడియా సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జి శ్రీనివాసులు మాట్లాడుతూ నియోజకవర్గం లోని ఐదు మండలాలకు చెందిన విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు ఇంటి స్థలాల మంజూరు అంశాలపై స్థానిక శాసనసభ్యులతో పాటు సంబంధిత శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. పత్రిక విలేకరులకు ఎప్పుడు, ఎక్కడ ఏమి జరిగినా తక్షణమే స్పందించి తక్షణ న్యాయం జరిగేలా చూస్తానని ఆయన పేర్కొన్నారు.

