చైన్ స్నాచింగ్, చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైదుకూరు అర్బన్ సర్కిల్ ఇన్ స్పెక్టరు కె.రమణారెడ్డి తెలిపారు. పోలీసు సూచనలు పాటించాలని కోరారు. మీరు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో, చుట్టు పక్కల ఎవరైనా అనుమానస్పంగా కొత్త వ్యక్తులు తిరుగుతుంటే వెంటనే 112 పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలన్నారు. బంగారు ఆభరణములు ధరించి మహిళలు ఒంటరిగా వాకింగ్ కు గాని నిర్మానుష్యమైన ప్రదేశం కు వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవ్వరైనా ఒంటరిగా ఉన్న మహిళల వద్దకు ఎవ్వరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఏదైనా అడ్రస్ అడుగుతున్నట్లు లేదా ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నట్లు చేస్తే వారి దగ్గర నుంచి జనాలు ఉన్న దగ్గరకు వెళ్ళిపోవాలని, లేక గట్టిగా అరచి చుట్టుపక్కల వారిని పిలవాలన్నారు. లేదంటే మీ మెడలోని బంగారు ఆభరణాలు లాక్కుని వెళ్లే అవకాశం ఉందన్నారు. దసరా సెలవుల్లో గ్రామాలకు వెళ్ళేవారు ఇంటిలో ఎలాంటి విలువైన బంగారు, వెండి ఆభరాలు, డబ్బు ఉంచరాదని వెంట తీసుకు వెళ్లాలని సూచించారు. పెరుగుతున్న చోరీల నేపథ్యంలో వీలైనంత వరకు ఇంటిలో ఎవరో ఒకరు ఉండేలా చూసుకోవాలన్నారు. ఏదైనా గ్రామానికి వెళ్ళే సమయంలో ఇంటికి తాళాలు వేసి వెళ్ళు సమయంలో సదరు విషయం స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలన్నారు. ద్విచక్ర వాహనాలను ఎక్కడైనా పార్కింగ్ చేయు సమయములో తప్పకుండా సైడ్ లాక్ వేయవలెను. బస్సులో ప్రయాణించే సమయములో మీ విలువైన వస్తువులు ఉన్న బ్యాగులు, పర్సులు జాగ్రతగా ఉంచుకోవలెను. బస్సులు ఎక్కడం, దిగే సమయంలో మీ చుట్టుపక్కన ఉన్న వ్యక్తులను గమనిస్తూ ఉన్నప్పుడే చోరీలు, చైన్ స్నాచింగ్ లను అడ్డుకోవచ్చునని పేర్కొన్నారు.
